ఆంధ్రప్రదేశ్ : ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 13న సెలవు
ఏపీలో ఈ నెల 13వ తేదీని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 13వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో దుకాణాలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వేడిని పెంచుతోంది. ఈ ఎన్నికలను మినీ అసెంబ్లీ పోరుగా పార్టీలు భావిస్తున్నాయి. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గెలిచే చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు .
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.