Saturday, January 7, 2023

PAKISTAN: ఎంబసీలు అమ్మేశారు.. ఘోరం గా మారిన పాకిస్థాన్ పరిస్థితి PLAKISTAN CRISIS: ఎంబసీలు అమ్మేశారు.. లైట్లు ఆఫ్ చేశారు.

నిన్న శ్రీలంక. నేడు పాకిస్థాన్! చైనాపై ఎక్కువగా ఆధారపడ్డ పాకిస్థాన్ కూడా శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి... అమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయాలను అమ్ముకునే స్థాయికి! కొత్త బల్బులు, ఫ్యాన్ల తయారీని ఆపేసినట్లే!

దాయాది పాకిస్థాన్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దేశం తీవ్ర ఆర్థిక సమస్యలతో పాటు భౌగోళిక, రాజకీయ సమస్యలతో సతమతమవుతోంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు పాకిస్థాన్ అంతటా విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించారు. దేశంలోని సగం వీధిలైట్లు ఆఫ్ అయ్యాయి. కొద్దిరోజుల పాటు బల్బులు, ఫ్యాన్ల తయారీపై కూడా నిషేధం విధించారు. అన్ని మార్కెట్లు, దుకాణాలు మరియు మాల్స్ రాత్రి 8.30 గంటలకు మూసివేయబడతాయి. రాత్రి 10.30 గంటల లోపు వివాహాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం 30 శాతానికి పైగా తగ్గింది. వీటన్నింటి వల్ల దాదాపు 600 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెరికాలోని పాత రాయబార కార్యాలయాలను కూడా పాకిస్థాన్ అమ్మకానికి పెట్టింది.

Also Read: AP సంక్రాంతి సెలవుల్లో మార్పు.

దెబ్బతిన్న ద్రవ్యోల్బణం, వరదలు

చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ చైనా సాయంపై ఆధారపడిన పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచాన్ని తాకిన ద్రవ్యోల్బణం భారీ ప్రభావాన్ని చూపింది. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 42 శాతానికి పెరిగిందని చెప్పారు.

* దీనికి తోడు.. గత జూన్‌లో కురిసిన వరదలు, వర్షాలతో పరిస్థితి దారుణంగా మారింది. దేశంలోని మూడో వంతు భారీ వరదల్లో మునిగిపోయింది. దాదాపు 3 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

* దీని వల్ల ఎగుమతులు తగ్గి ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ఎగుమతులు తగ్గడం వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గాయి.

Also Read: Download SA1 Key papers

నెలకు సరిపడా...

* ప్రస్తుతం పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు (5.5 బిలియన్ డాలర్లు) కేవలం 3 నెలల దిగుమతులకే సరిపోతాయి.

* ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్‌కు 228 రూపాయల వద్ద నడుస్తోంది.

* పాకిస్తాన్ సహాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), సౌదీ అరేబియా చుట్టూ తిరుగుతోంది. సౌదీ ఇప్పటికే 8 బిలియన్ డాలర్ల సాయం అందించినా అది సరిపోవడం లేదు.

* విడతల వారీగా 800 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేసేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. కానీ అనేక షరతులు విధిస్తోంది. ముఖ్యంగా పన్నులు పెంచబోతున్నారు. వాటిని ఆమోదించడం వల్ల ప్రజలపై భారం పడుతుంది. రాజకీయంగా, ఆర్థికంగా నలిగిపోతున్న ప్రజానీకం తిరగబడితే సమస్యలు తీవ్రమవుతాయనే భయం నేతల్లో నెలకొంది. ఫలితంగా, IMF సహాయం అనిశ్చితిలో పడిపోయింది. షరతులపై పట్టుబట్టకుండా చాలా సహాయం చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల IMFకి విజ్ఞప్తి చేశారు.

* జూన్ 2023 వరకు అప్పులు, ఇంధన చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం 30 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా.. దీంతో మరోసారి సౌదీ వైపు మొగ్గు చూపాలని పాక్ నేతలు ఆలోచిస్తున్నారు.

Also Read: Download ZPPF Balance Slips

* గత ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో దేశంలో రాజకీయంగా కూడా అనిశ్చితి నెలకొంది.

చేజారుతున్న ఖైబర్...

పులిమీద పుట్రలా.. అఫ్ఘానిస్థాన్ నుంచి పాకిస్థాన్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరిహద్దుల్లోని పష్తూన్ గిరిజన ప్రాంతాలపై పట్టు కోసం తాలిబన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాబూల్ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా రాష్ట్రంపై కన్నేసింది. తాలిబాన్ మద్దతుగల తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దళాలు తరచుగా పాకిస్తాన్ సైన్యంతో ఘర్షణ పడుతున్నాయి. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు మద్దతిచ్చిన తాలిబన్లు ఇప్పుడు పక్కదారి పట్టడం పాక్ నేతలకు ఇబ్బందికరంగా మారింది.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top