Tuesday, December 27, 2022

Transfers 2022 break: ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్... టీచర్ల బదిలీ మార్గదర్శకాలు సరిగా లేవు ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్

టీచర్ల బదిలీ మార్గదర్శకాలు సరిగా లేవు

ప్రాథమికంగా అభిప్రాయపడిన హైకోర్టు

తుది జాబితా ప్రకటించవద్దని స్పష్టీకరణ

ఉపాధ్యాయుల బదిలీ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ ఈనెల 10న జారీచేసిన జీవో 187లోని మార్గదర్శకాలు సక్రమంగా లేవని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. యాంత్రి కంగా మార్గదర్శకాలిచ్చినట్లుందని తెలిపింది. అనాలోచి తంగా జీవో ఇచ్చారని ఆక్షేపించింది. గత బదిలీలలో 'ప్రాధాన్యత కేటగిరి' కింద ప్రయోజనం పొంది ఉంటే ఇప్పుడు ఆ ప్రయోజనం వర్తించదని ప్రభుత్వం చెప్ప డాన్ని తప్పుపట్టింది. 2020లో బదిలీ అయిన ఉపాధ్యా యులకు మాత్రమే అదనపు పాయింట్లు ఇచ్చేలా తీసు కున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ప్రభుత్వం తీసు కున్న పాఠశాలల మ్యాపింగ్ నిర్ణయం కారణంగా బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడినందున అందరికి ప్రత్యేక పాయింట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని వెల్లడిం చింది. అవకాశం ఇచ్చినప్పటికీ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలకు అధికారులు పరిష్కారం చూపలేనం దున వ్యాజ్యంపై లోతుగా విచారణ చేసి తగిన ఆదేశా లిస్తామని తేల్చిచెప్పింది. ఉపాధ్యాయుల అభ్యంతరా లను పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులకు స్వేచ్ఛనిచ్చింది. తుది జాబితా ప్రకటించవద్దని పేర్కొంది. సమగ్రంగా కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

* ఇటీవల వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయ మూర్తి.. ప్రాథమిక సీనియార్టీ లిస్ట్ ప్రటించిన తర్వాత.. అభ్యంతరాలు దాఖలు చేసేవరకు మాత్రమే ప్రక్రియ జరపాలని అధికారులకు తేల్చిచెప్పారు. తద నంతరం ముందుకెళ్లాలంటే కోర్టు ఇచ్చే ఆదేశాల కోసం వేచి చూడాలన్న విషయం తెలిసిందే..

ఉపాధ్యాయుల బదిలీ భారీగా కో లకు బ్రేకపడింది. బదిలీల సంద ర్భంగా జారీ అయిన అనేక ఉత్త ర్వులు, నిబంధనల్లో మార్పులు, పాయింట్స్ విషయం లో జరిగిన తప్పిదాలపై గతంలో ఎన్నడూ లేనివిధం గా భారీసంఖ్యలో కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియను ఎక్కడికక్కడ నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. వచ్చేనె ల 4వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిలిచిపోనుంది.

 ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఈనెల 12 నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈనెల 19 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించారు. తుదిజాబితా కోసం అభ్యంతరాల స్వీకరణను విద్యా శాఖ ఈనెల 25 నుంచి ప్రారంభించింది. అయితే పాయింట్స్ విషయంలో జారీ చేసిన జీవోనం 187. ఆ తరువాత జారీ చేసిన సవరణల జీవో 190పై భారీ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 500పైగా అభ్యంతరాలు వచ్చి నట్లు సమాచారం. అభ్యంతరాలు ఇక్కడ స్వీకరిం చకుండా నేరుగా CSE వెబ్సైట్లో నమోదు చేసేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎస్ఈలో అభ్యంతరాలు స్వీకరించడం మినహా వాటికి పరిష్కారం చూపడం లేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అనేకమందికోర్ట్ ని  ఆశ్రయించడంతో భారీగా కేసులు నమోదైనట్లు నాయకులు చెబుతు న్నారు. మరోవైపు మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తుల్ని ఎంఈవోలు కనీసం పరిశీలించకుండా వాటిని డీఈవో కార్యాలయానికి పంపారు. ఇక్కడ విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహ రించారు. 15 మంది హెచ్ఎంలకు దరఖాస్తుల పరిశీ లన బాధ్యతలు అప్పగించి మిన్న కుండి పోయారు. విద్యాశాఖలోని డీవైఈవో, ఏడీలు హెచ్ఎంలకు 'సూచనలు ఇస్తూ తమకేమి పట్టనట్లు వ్యవహరిం చారని సంఘాలు వాపో తున్నాయి.

అన్ని కేటగిరిల్లో ఫిర్యాదులే..

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల్లో అన్ని కేటగిరిల్లోనూ కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చిన. ట్లు సమాచారం. ప్రధానంగా ప్రిపరెన్షియల్ కేటగిరి లో వందల సంఖ్యలో ఫిర్యాదులున్నాయి. లు ఉన్నట్లుగా ధ్రువీకరించుకుని పాయింట్స్ పొందిన ట్లు ఫిర్యాదులున్నాయి. అదేవిధంగా తమపై ఆధారప డనివారికి కూడా వ్యాధులున్నాయని ధ్రువీకరణ పత్రాలు తీసుకువచ్చారు. ఇంకా స్పౌజ్, రేషనలైజేషన్  పాయింట్ల విషయంలో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తా. యి. ఈ నేపథ్యంలో బదిలీలు నిలిచిపోయాయి.0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top