Sunday, November 13, 2022

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!



Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!


ఇప్పుడు వివిధ సందర్భాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. కొందరు ఇళ్లు కొనేందుకు, మరికొందరు కార్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఈ సందర్భంలో, నిర్దిష్ట వ్యవధిలో వడ్డీతో పాటు డబ్బును బ్యాంకుకు తిరిగి చెల్లించాలి. చాలా మంది వ్యక్తిగత అవసరాలు, వివాహం లేదా కుటుంబ కారణాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. చాలా మంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకుని ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాంటిది చేయడం కచ్చితంగా తెలివైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పర్సనల్ లోన్ తీసుకుని స్టాక్ మార్కెట్ లాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆర్థిక సలహాదారుల ప్రకారం, వ్యక్తిగత రుణం తీసుకోవడానికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు కాబట్టి బ్యాంకులు ఈ రుణాలపై అత్యధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. ఇతరత్రా పెట్టుబడులు పెట్టి నష్టపోతే వడ్డీతోపాటు మరింత నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరైనా బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకుని పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Home Loan హౌసింగ్ లోన్ తీసుకునే వారికి బంపెరాఫర్

అనవసరంగా పర్సనల్ లోన్ తీసుకోనవసరం లేదు. బ్యాంకులు చాలా మంది కస్టమర్‌లకు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లను అందిస్తాయి. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు CIBIL స్కోర్ ఆధారంగా ఈ రుణాలను అందిస్తాయి. మీరు సులభంగా 10 నుండి 15 లక్షల రూపాయల రుణాన్ని పొందవచ్చు.

లోన్ లభ్యత కారణంగా అనవసర రుణాలతో ఆర్థిక భారాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఈ సందర్భంలో, నిర్దిష్ట వ్యవధిలో వడ్డీతో సహా డబ్బును బ్యాంకుకు తిరిగి ఇవ్వాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు.. నష్టాలు కూడా రావచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం పొందడం సరికాదని నిపుణులు అంటున్నారు.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top