JEE Main 2022 Admit Card: అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడంటే ?
జూన్ 23 నుంచి JEE MAIN ఫేజ్ 1 ఎంట్రన్స్ పరీక్షల నేపథ్యం లో ఇంతవరకు NTA అడ్మిట్ కార్డ్స్ విడుదల చేయలేదు . పరీక్షకి సిద్ధం అవుతున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది . అయితే రెండు రోజుల్లో అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యే అవకాశం ఉందని విద్యార్థులు కంగారు పడవలసిన అవసరం లేదని తెలుస్తుంది
EE Main 2022 Session 1 Admit Card download: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2022) మెయిన్ పరీక్ష తేదీ సమీపిస్తున్నా అడ్మిట్ కార్డులు మాత్రం ఇంకా విడుదలవ్వలేదు. దేశ వ్యాప్తంగా మొత్తం 501 పరీక్ష కేంద్రాల్లో జూన్ 23వ తేదీ నుంచి 29 తేదీ వరకు జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జాం సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఇప్పటికే (జూన్ 14) ఎన్టీఏ ప్రకటించినా అడ్మిట్ కార్డుల (Admit Card) విడుదల చేయడంలో జాగరూకత నెలకొంది. జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్లు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్ జూన్ 2022, జేఈఈ మెయిన్ జులై 2022లుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండో సెషన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జులై సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరుగుతాయి. విద్యార్ధుల సందేహాల నివృతికి 011-40759000 లేదా ఈ-మెయిల్ — jeemain@nta.ac.in.లను సంప్రదించవచ్చు
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.