Saturday, June 25, 2022

AMMA VODI 2022: అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు... వచ్చే నెలలో సంక్షేమ క్యాలెండర్‌
అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు... వచ్చే నెలలో సంక్షేమ క్యాలెండర్‌

43.96 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 27న జమకు కేబినెట్‌ ఆమోదం 

82.31 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం

వచ్చే నెలలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు

అర్హులైనా గతంలో సంక్షేమ ఫలాలు దక్కని వారికి వచ్చే నెల 19న అమలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు. ఈ పథకం కింద ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు

ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

DOWNLOAD AMMAVODI FINAL LISTS

నాణ్యమైన విద్య దిశగా మరో ముందడుగు

ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యా రంగంలో మరో భారీ కార్యక్రమం అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తద్వారా కొందరికే పరిమితమైన ఎడ్యు–టెక్‌ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు అందుబాటులోకి రానుంది. 

► ఏటా రూ.20 వేల నుంచి రూ.24 వేలు పైబడి చెల్లిస్తేకాని లభించని బైజూస్‌.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు అందుబాటులోకి వస్తోంది. తెలుగు – ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

► 2025లో సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులుగా మార్చేందుకు ప్రభుత్వం ఇంకొన్ని అడుగులు వేస్తోంది. ఈ విద్యార్థులకు సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు ఇవ్వనుంది.

► దాదాపు 4.7 లక్షల మంది పిల్లలకు ఈ సెప్టెంబర్‌లో ట్యాబ్‌లు ఇస్తున్నాం. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తుంది. వీళ్లు 9వ తరగతిలోకి వెళ్లేసరికి ఆ తరగతి పాఠాలకు సంబంధించి కంటెంట్‌ డౌన్లోడ్‌ చేసి సిద్ధం చేస్తుంది. అలాగే 10వ తరగతిలోనూ కంటెంట్‌ను సమకూరుస్తుంది. 

► వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రించనుంది. వీడియో కంటెంట్‌ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తోంది. 

జూన్ 27 న అమ్మఒడి .. శ్రీకాకుళం జిల్లాలో కార్యక్రమం   .. మార్గదర్శకాలు

వచ్చే నెలలో సంక్షేమ క్యాలెండర్‌ అమలు 

► 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జూలైలో అమలు చేయనున్న నాలుగు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 5న జగనన్న విద్యా కానుక, జూలై 13న వైఎస్సార్‌ వాహన మిత్ర, జూలై 22న వైఎస్సార్‌ కాపు నేస్తం, జూలై 26న జగనన్న తోడు పథకాల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

► వివిధ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి.. మిగిలి పోయిన లబ్ధిదారులకు జూలై 19న ఆ పథకాల కింద ప్రయోజనం చేకూర్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

► వంశధార ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారంగా రూ.216.71 కోట్ల పంపిణీకి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది.  

వర్శిటీ, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు PRC

► యూనివర్సిటీలు, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

► 70 ఏళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదనే ప్రతిపాదనకు ఆమోదం. పెన్షనర్‌ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌ మరణిస్తే అంతిమ సంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

► అర్జున అవార్జు గ్రహీత, ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ వెన్నంకు గ్రూప్‌–1 సర్వీసు కింద డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులో నియామకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లును మంత్రివర్గం ఆమోదించింది.

ఇక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా..

► కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు కేబినెట్‌ ఆమో


దం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌ను ఆమోదించింది. 

► కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టులు మంజూరు.

► నెల్లూరు జిల్లా కనుపూరులో మైసూరుకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్ట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ క్లాసికల్‌ తెలుగు కోసం 5 ఎకరాల స్థలం.

► సత్యసాయి జిల్లా పెనుకొండలో 63.29 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.

► ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్ట్‌ 1971కు సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌. 

► వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరులోని సర్వారాయ సాగర్‌ రిజర్వాయర్‌ పేరును కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్‌గా మార్పు చేస్తూ.. జల వనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. 0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top