Thursday, May 19, 2022

JAGAN EDUCATIONAL REVIEW: బెండపూడి విద్యా విధానమే అంతటా ఉండేలా చర్యలు.. విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ బెండపూడి విద్యా విధానమే అంతటా ఉండేలా చర్యలు.. విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత‍్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నాడు–నేడుతో పాటు విద్యాశాఖకు సంబంధించి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు, పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.

అధికారులు అందజేసిన వివరాలు..

►ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు ప్రక్రియపై వివరణ.

► రూ.8 వేల కోట్లతో సుమారు 23,975 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ కింద సమూల మార్పులు.

► ఈ నెల 20న గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ లాంఛ్‌.

► ఇంగ్లిషు భాష అభ్యసనం, ఫొనిటిక్స్‌ కోసం ఈ ప్రత్యేక యాప్‌. గూగుల్‌ సహకారంతో రూపొందించిన ఈ యాప్‌ సమగ్రమైన ఇంగ్లిషు భోధనకు ఉపయోగకరంగా ఉంటుందన్న అధికారులు.

► అమ్మఒడికు బదులుగా 8.21 లక్షల మంది విద్యార్ధులు లాప్‌ టాప్‌ ఆప్షన్‌ ఎంచుకున్నారని తెలిపిన అధికారులు.

► నాడు–నేడులో భాగంగా ఇప్పటివరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయన్న అధికారులు.

స్కూల్స్‌ నాడు–నేడు రెండో దశ పనులపై సీఎం సమీక్ష

సుమారు 23,975  వేల స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ కింద పనులు. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండోదశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలని సీఎం జగన్‌ ఆదేశం.

గోరుముద్ద కార్యక్రమంపై సమీక్ష

టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుమద్ద కార్యక్రమాలపై మరింత ధ్యాస పెట్టాలన్న సీఎం జగన్‌.. సమర్ధవంతంగా, నాణ్యతతో అమలు చేయాలి, అప్పుడే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటామని అధికారులకు వెల్లడి. టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుముద్ద అమలను మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో ఆలోచన చేయండని అధికారను కోరిన సీఎం జగన్‌.

►గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్‌ కళాశాలలు మాత్రమే ఉండేవి.. ఇవాళ ఏకంగా 1200 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు.

► బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కళాశాల లేదంటే కేజీబీవీ అదీకుదరకుంటే.. హైస్కూల్‌ ప్లస్‌ వచ్చే విధంగా ఏర్పాటు. దీన్ని అందరికీ తెలిసేలా విస్తృతంగా చెప్పాలన్న సీఎం జగన్‌.. తద్వారా వినియోగించుకునే అవకాశాలు మెరుగుపడతాయని సూచన.

► స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, బాత్రూమ్‌ల నిర్వహణ వంటివి సమర్ధవంతంగా నిర్వహించాలి. దీని కోసం పక్కాగా ఎస్‌ఓపీలు ఉండాలని ఆదేశం.

జగనన్న విద్యా కానుక పై సీఎం సమీక్ష

► విద్యాకానుక కిట్‌ నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దన్న సీఎం జగన్‌.. పంపిణీకి సర్వం సన్నద్ధంగా ఉండాలని ఆదేశం. 

► జూలై4 నాటికి జగనన్న విద్యాకానుక ప్రారంభానికి సకలం సన్నద్ధం చేస్తామన్న అధికారులు.

అమ్మఒడి పైనా సమీక్ష 

► జూన్‌లో అమ్మఒడి కార్యక్రమం కోసం సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం.

ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు ప్రావీణ్యం.. కాకినాడ జిల్లా తొండంగి మండలం, బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధుల ఇంగ్లిషు ప్రతిభను సీఎం దృష్టికి తీసుకొచ్చిన అధికారులు. ఇంగీషు భాషపై బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధులు మంచి పట్టు సాధించారని తెలిపిన అధికారులు. మీ స్ఫూర్తితోనే ఇంగ్లిషులో ప్రావీణ్యం అని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధులు. ప్రత్యేకంగా విద్యార్థులతో భేటీ అయిన సీఎం జగన్‌. అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడిన బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధులు.  ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం బోధన వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా మీరే మాకు స్ఫూర్తిగా నిల్చారన్న విద్యార్ధులు. విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా.. ఇన్ని గొప్ప పథకాలు ప్రవేశపెడుతున్నారని... మీ వల్లే ఇంత గొప్పగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోగలుగుతున్నామన్న ఎనిమిదో తరగతి విద్యార్ధిని తేజస్విని. తన చెల్లాయితో కలిసి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బులు రూ.929ను సీఎంకు విరాళంగా ఇవ్వబోయిన విద్యార్థిని..  గుర్తుగా కేవలం రూ.19 తీసుకుని మిగిలిన డబ్బులు విద్యార్థినికే ఇచ్చిన సీఎం జగన్‌.

► బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ ఇంగ్లిషు టీచర్‌ ప్రసాద్‌ పిల్లలకు  నేర్పించిన ఇంగ్లిషు బోధనా విధానాన్ని ఎస్‌ఓపీగా రూపొందించాలన్న సీఎం జగన్‌. 

► రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఈ తరహా లెర్నింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేలా చూడాలని, ఫొనిటిక్స్‌పై ప్రస్తుతం రీసెర్చ్‌ చేస్తున్న వారిని ఇందులో భాగస్వామ్యులను చేయాలన్న  ఆదేశం.

► భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్, డైలెక్ట్‌ చాలా ప్రధానమైన అంశాలు కావడంతో.. ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని అధికారులకు సూచన. గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌.. యాప్‌ ప్రతి టీచర్‌ మొబైల్‌లో ఉండేలా చూడాలని, ఇంగ్లిషు టీచర్‌ ప్రసాద్‌ లాంటి వాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అధికారుల వద్ద ప్రస్తావించిన సీఎం సీఎం.

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ,  పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వశిక్షా అభయాన్‌ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top