Friday, May 13, 2022

మీ పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా.. విస్మరిస్తే తీవ్ర ప్రమాదం..LEGS

 Health Tips: మీ పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా.. విస్మరిస్తే తీవ్ర ప్రమాదం.. అవేంటంటే?

High Cholesterol: ప్రస్తుతం అధిక కొలెస్ట్రాల్ చాలా సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయి గుండె జబ్బులు, స్ట్రోక్(heart attack) ప్రమాదాన్ని పెంచుతుంది. 2018 నివేదిక ప్రకారం, భారతదేశంలో హృదయ సంబంధ వ్యాధులతో మరణించే వారి రేటు 34 శాతం పెరిగింది. దీంతో మరణాల రేటు 155.7 నుంచి 209.19 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. మరణించిన వారిలో, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, మంచి ఆహారంతో పాటు, కొలెస్ట్రాల్‌ను ఎల్లవేలలా చెక్ చేసుకుంటూ ఉండాలి. తద్వారా కొలెస్ట్రాల్ సకాలంలో నియంత్రించుకోవచ్చు. దీంతో ఆరోగ్య ప్రమాదాలను కూడా త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే, పాదాలలో కనిపించే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను కూడా తాజాగా నిపుణులు వెల్లడించారు. ఈ లక్షణాలను మాత్రం అస్సలు విస్మరించకూడదని అంటున్నారు. మీలో కూడా ఈ లక్షణాలను గమనిస్తే, వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

ALSO READ:

 SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI Alert: ఖాతాదారులకు SBI హెచ్చరిక.. 

SBI YONO: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా SBI YONO యాప్..!

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

కొలెస్ట్రాల్ కాలేయంలో తయారయ్యే మైనపు పదార్థం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ (LDL). LDL కొలెస్ట్రాల్ శరీరానికి ప్రమాదకరం. దీని పెరుగుదల వల్ల శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. అధిక కొలెస్ట్రాల్ పరిస్థితిని చూసిన తర్వాత డాక్టర్ చికిత్స చేస్తారు.

ఆరోగ్యకరమైన వ్యక్తికి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలంటే:

మొత్తం కొలెస్ట్రాల్: 200 కంటే తక్కువ – 239 mg/dL

HDL: 60 mg/dL కంటే ఎక్కువ

LDL: 100 mg/dL కంటే తక్కువ

పాదాలలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?

ఒలియో లుస్సో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మోనికా వాస్సెర్మాన్ ప్రకారం, పరిస్థితి ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు సాధారణంగా కనిపించవు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిని గుర్తించడానికి రక్త పరీక్ష చేయవలసి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్ని లక్షణాలు పాదాలలో కనిపించడం ప్రారంభవుతాయని తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ఎవరైనా వారి పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే, వాటిని విస్మరించకూడదు. ఎందుకంటే ఈ లక్షణాలు శరీరంలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి. పాదాలు, కాలి వేళ్లు తిమ్మిరి, పసుపు గోర్లు కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతాలుగా నిలుస్తాయి. అంటే ధమనులు, రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగిందని తెలుసుకోవచ్చు.

ఇది కాకుండా, దిగువ పేర్కొన్న లక్షణాలు కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు కావొచ్చు..

ఛాతి నొప్పి

దిగువ శరీరం చల్లగా ఉంటుంది

తరచుగా శ్వాస ఆడకపోవడం

వికారం

అలసినట్లు అనిపించడం

రక్తపోటులో పెరుగుదల

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అధిక కొలెస్ట్రాల్‌కు గురయ్యే వ్యక్తులు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, వండిన ఆహారం, వేయించిన ఆహారం తీసుకోకుండా ఉండాలి. కాగా, ఆయిల్ ఫిష్ (మాకేరెల్, సాల్మన్), బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ పాస్తా, నట్స్, గింజలు, పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి.

ALSO READ: 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?

ఉదయాన్నే ఈ నీరు తాగితే Sugar అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటె జాగర్త

ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..


SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

job news HEALTH TIPS

TRENDING

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top