Monday, May 9, 2022

AIRTEL, JIO యూజర్లకు బంపరాఫర్‌!



 AIRTEL, JIO  యూజర్లకు బంపరాఫర్‌!


ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోలు యూజర్లకు బంపరాఫర్లు ప్రకటించాయి. ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌లు ఫ్రీగా వీక్షించేలా ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. 

ఎయిర్‌టెల్‌,జియోలు అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్‌లతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు,మూవీస్‌, షోస్‌తో పాటు న్యూస్‌ను ఫ్రీగా చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం టెలికాం సంస్థలు తెచ్చిన ప్లాన్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

►జియో ఇప్పటికే రూ.2999, రూ.1066, రూ.799, రూ.4199, రూ.601 ప్లాన్‌లపై డిస్నీ ప్లస్‌ హాట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండగా తాజాగా మరికొన్ని ప్లాన్‌లను యూజర్లకు పరిచయం చేసింది. 

READ: JIO OFFER: జియో అదిరిపోయే బంపరాఫర్‌, రూ.200కే..

►జియో రూ.151: ఈ ప్లాన్‌లో యూజర్లు కేవలం ఇంటర్నెట్‌ డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తం 8జీబీ డేటాతో పాటు అదనంగా  డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. 

►జియో రూ.333 - ప్రీపెయిడ్ ప్లాన్ ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు,1.5జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. 28రోజుల వ్యాలిడిటీతో డిస్నీ హాట్‌స్టార్ ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది.

READ: JIO కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..

►జియో రూ.583 - జియో నుండి 3వ కొత్త డిస్నీ ప్లాన్ ధర రూ.583 . అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు, 1.5జీబీ డేటాను అందిస్తోంది. ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.  

 ►జియో రూ.783 ప్లాన్ - 84రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.5జీబీ డేటా, ఫ్రీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ను అందిస్తుంది. 

కొత్త ఎయిర్‌ టెల్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ప్లాన్‌లు 

►ఎయిర్‌టెల్ రూ.399, రూ.839 విలువైన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది .

READ: JIO సునామి అఫర్: 899 రూపాయలకే 336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్

►ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్: 28రోజుల వ్యాలిడిటీతో  ప్రతిరోజు 2.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇది మూడు నెలల డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఒక నెల ఉచిత అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24|7 సర్కిల్ లను వినియోగించుకోవచ్చు. 

►ఎయిర్‌టెల్ రూ.839 ప్లాన్: 84రోజుల వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు, 3నెలల ఫ్రీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌ ట్రీమ్‌ మొబైల్ ప్యాక్, రూ.100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల్ని పొందవచ్చు.

ALSO READ: 

JIO: జియో మ‌రో సంచ‌న‌లం!! SUPER FAST NET !

Jio 5G: జెట్‌ స్పీడ్‌లో రిలయన్స్‌ జియో 5జీ.. స్పీడ్‌ ఎంతంటే..?


SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

job news HEALTH TIPS

TRENDING

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top