Friday, March 25, 2022

బ‌స్సులోనే మ‌ద్యం సేవించిన స్కూల్ విద్యార్థులు… వీడియో వైర‌ల్‌ : TAMIL NADU



 


కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో జరిగినట్లు గుర్తించారు. వీడియోలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్‌ ధరించి బస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరిలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బీర్‌ బాటిల్‌ను ఓపెన్‌ చేసి తాగుతూ కనిపించారు. ఈ తంతంగాన్నంతా తోటి విద్యార్థులు రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు

ఈ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో బస్‌లోని విద్యార్థులంతా చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా తెలిసింది. తిరుకజుకుండ్రం నుంచి తాచూర్‌కు వెళుతున్నారు. అయితే ముందుగా ఈ వీడియో పాతది అనుకున్నారు. కానీ మంగళవారం జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఇలా విద్యార్థులు బస్‌లో మద్యం సేవిస్తున్న విషయం చివరికి అధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు



0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top