Tuesday, March 15, 2022

Madras HC: సెల్‌ఫోన్లు వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్‌ హైకోర్టు షాక్‌



 Madras HC: సెల్‌ఫోన్లు వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్‌ హైకోర్టు షాక్‌


చెన్నై: సెల్‌ఫోన్‌ ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అది లేనిదే పిల్లలకు ముద్ద దిగడం లేదు. పెద్దలకు పనులు జరగడం లేదు. ఈ తరుణంలో.. పని టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్‌లో మునిగిపోవడాన్ని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది.

ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియన్‌ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే రూపొందించాలని, రూల్స్‌ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ సుబ్రమణియన్‌ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.



0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top