త్వరలో 666 MEO పోస్టులు భర్తీ

 త్వరలో 666 MEO పోస్టులు భర్తీ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా 666 ఎంఈవో పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శుక్రవారం | శాసనమండలి| ప్రశ్నోత్తరాలలో పీడీఎఫ్ సభ్యులు విరపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 264 ఎంఈవో పోస్టుల ఖాళీలను గుర్తించడం జరిగిందన్నారు. అలాగే వీటికి అదనంగా మరో 402 పోస్టులను కూడా భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని మంత్రి వెల్లడించారు. అలాగే క్రాప్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టుల అవసరం మేరకు నియామకాలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ పక్షనేత విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలన కుంటుపడుతుందని తెలిపారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ డీ ఈ వో పోస్టులను కూడా భర్తీ చేయాలని సూచించారు. సర్వీస్ రూల్స్క సంబంధించి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి. మాట్లాడుతూ పదోన్నతులు సర్వీస్ రూల్స్ రూపొందించి వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రూల్స్ అంశం కోర్టుల్లో పెండింగ్లో ఉందని, వారంలో రెండు, మూడు రోజుల పాటు అధికారులు కోర్టులకు హాజరు అయ్యే పరిస్థితి ఉందని, మంత్రి తెలిపారు. ఈ నెల చివరిలో కోర్టు వాయిదా ఉందని దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad