Monday, March 7, 2022

మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.45,000 ఆదాయం అందించండి.



 మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.45,000 ఆదాయం అందించండి..


NPS Scheme: మార్చి 8 మహిళా దినోత్సవం. ఈ రోజున మీ భార్యకి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. మీరు ఉన్నా లేకున్నా ఇంట్లో నిలకడైనా ఆదాయం ఉండాలి. అప్పుడే కుటుంబం సజావుగా నడుస్తుంది. అన్ని పనులు సకాలంలో జరుగుతాయి. అందుకోసం మీ భార్య పేరుపై నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి. నెలవారీ ఆదాయం అందించండి. మీరు మీ భార్య పేరు మీద కొత్త పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాను ఓపెన్ చేయవచ్చు. దీనివల్ల మీ భార్యకు 60 ఏళ్లు నిండిన తర్వాత ఏక మొత్తంలో డబ్బు అందజేస్తుంది. అంతేకాకుండా ప్రతినెలా పెన్షన్ రూపంలో నిలకడైన ఆదాయం ఉంటుంది. ఇది మాత్రమే కాద NPS ఖాతాతో మీరు మీ భార్యకు ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలో కూడా నిర్ణయించవచ్చు. దీంతో మీ భార్య 60 ఏళ్లు దాటిన తర్వాత డబ్బు కోసం ఎవరిపైనా ఆధారపడదు. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

మీరు NPS ఖాతాలో మీ సౌలభ్యం ప్రకారం ప్రతి నెల డబ్బు జమ చేయవచ్చు. కేవలం రూ.1,000తో మీ భార్య పేరు మీద ఎన్‌పీఎస్‌ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. NPS ఖాతా 60 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. నిబంధనల ప్రకారం.. మీకు కావాలంటే మీ భార్య వయస్సు 65 సంవత్సరాల వరకు డబ్బులు జమచేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీ భార్యకు 30 ఏళ్లు ఉంటే మీరు ఆమె NPS ఖాతాలో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెట్టండి. ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి వస్తే 60 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో మొత్తం రూ.1.12 కోట్లు ఉంటాయి. ఇందులో దాదాపు 45 లక్షల రూపాయలు వారికి అందుతాయి. ఇది కాకుండా వారు ప్రతి నెలా దాదాపు రూ.45,000 పింఛను పొందడం ప్రారంభిస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వారు జీవితాంతం ఈ పెన్షన్ పొందుతూనే ఉంటారు

NPS అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే డబ్బుని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. ఈ వృత్తిపరమైన ఫండ్ మేనేజర్లకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతను అప్పగిస్తుంది. ఈ పరిస్థితిలో NPSలో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. కానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టే డబ్బుపై రాబడికి హామీ లేదు. ఫైనాన్షియల్ ప్లానర్ల ప్రకారం.. ఎన్‌పిఎస్ ప్రారంభమైనప్పటి నుంచి సగటున 10 నుంచి 11 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top