Steering Committee : స్టీరింగ్ కమిటీలో విభేదాలు.. కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు
Steering Committee : పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చల్లో విభేదాలు వచ్చాయి. స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. తమ విన్నపాలను పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. ఆదివారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపాయి. స్టీరింగ్ కమిటీ ఒంటెద్దు పోకడతో రాజీపడిందని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుధీర్ జోసఫ్, హృదయరాజ్ మీడియా సమావేశాన్ని బహిష్కరించారు. మంత్రుల కమిటీతో చర్చల్లో తమ విన్నపాలను ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.
మారిన కొత్త HRA (10%, 12%, 16%, 24% ) రేట్ ల ప్రకారం గా మీ కొత్త జీతం ఎంతో తెలుసుకోండి
మరోవైపు స్టీరింగ్ కమిటీతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం అర్థం చేసుకుందని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో 7వ తేదీ నుంచి చేపట్టాల్సిన సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు.
” మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంది. హెచ్ఆర్ఏ శ్లాబులను ప్రభుత్వం పెంచింది. సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. ఉద్యోగులకు, పెన్షనర్లకు రికవరీ లేకుండా చూశారని తెలిపారు. సోమవారం సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతాం” అని స్టీరింగ్ కమిటీ సభ్యులు చెప్పారు.
ఆ 4గురు ఉద్యోమ ద్రోహులు..రాజీనామాకు రెడీ
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.