PRC Struggle Committee: AP CS కు ఫిర్యాదు

మమ్మల్ని  వీధి కుక్కలతో పోల్చిన వారి మీద చర్యలు తీసుకోండి .


ఏపీలో పీఆర్సీ రగడ ఇంకా చల్లారలేదు.పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వ చర్చల అనంతరం తమ పోరాటాన్ని ఆపేశారు. అయితే మరో వర్గం మాత్రం పీఆర్సీ స్ట్రగుల్ కమిటీపై మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల విమర్శలపై ఘాటుగా స్పందించింది పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ. ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఫిర్యాదు చేశారు నలుగురు నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ.

తమపై కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు. తమ నలుగురి ప్రతిష్టతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. వీధి కుక్కలతో పోలుస్తూ అనంతపురం జిల్లాలో కొంత మంది ఉపాధ్యాయులు వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎస్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నలుగురు నేతలకు సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటించిన సంఘటనల వివరాలను లేఖలో ప్రస్తావించారు స్ట్రగుల్ కమిటీ నేతలు. ఇటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు జేఏసీ నేతలు. దీనిపై సీఎస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

DOWNLOAD COMPLAINT LETTER COPY

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad