CM Jagan: విద్యార్థులకు భోజనం వడ్డించిన సీఎం జగన్.
అమరావతి: ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి ఆహారం అందించేందుకు ఇస్కాన్‌కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలను సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద రూ.20కోట్లతో అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ ఏర్పాటు చేసింది. కేవలం 2 గంటల్లోనే 50వేల మందికి ఆహారం సిద్ధం చేసేలా దీన్ని నిర్మించారు.
వంటశాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన కూడా వంటకాలను రుచి చూశారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేస్తున్న విధానాన్ని అక్షయపాత్ర ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం సీఎం కొలనుకొండ వెళ్లారు. అక్కడ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి ఆయన భూమి పూజ చేశారు. రూ.70కోట్లతో ఏర్పాటు చేయనున్న గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులు, వేంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ధ్యాన కేంద్రాలు, యువతకు శిక్షణనిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.