AP PRC: సమస్యను జటిలం చేసుకోవద్దు: సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: ఒక విధంగా ఉద్యోగులు రేపు చేసేది బల ప్రయోగం అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని పిలిచినట్లు చెప్పారు. సమస్యను జటిలం చేసుకోవద్దని సజ్జల హితవు పలికారు. పీఆర్సీ సాధన కోసం రేపు ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘సమ్మెలు చేస్తే ప్రభుత్వం మెడలు వంచవచ్చనేది వాళ్ల అభిప్రాయం. ఉద్యోగులు తమ కార్యాచరణ పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డెక్కడం సరైన పద్ధతి కాదు’’ అని సజ్జల అన్నారు
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.