Saturday, January 15, 2022

Income Tax: ఆదాయ పన్నుకు గుడ్‌బై చెప్పేసే సమయం వచ్చేసింది... Income Tax: ఆదాయ పన్నుకు గుడ్‌బై చెప్పేసే సమయం వచ్చేసింది...

Income Tax: ఇప్పుడు మనదేశంలో ఆదాయం ప్రాతిపదికగా కాకుండా.. ఖర్చుల ఆధారంగా పన్నులు వేయాలి. ఆదాయ పన్ను స్థానంలో వ్యయ పన్ను రావాలి. అప్పుడే పారదర్శకత పెరుగుతుంది.

దేశంలో వ్యక్తిగత పన్నుల వ్యవస్థ ప్రక్షాళనకు సమయం ఆసన్నమయింది. ఆదాయపన్ను (Income Tax) నుంచి వ్యయ పన్ను (Expenditure Tax)కు మారేందుకు ఇదే సరైన సమయం.. ఆదాయపన్నుపై ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. నెలా నెలా జీతం తీసుకునే సామాన్య ప్రజలే పన్నులను సక్రమంగా కడుతున్నారు. కానీ కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తులు, కంపెనీలు మాత్రం పన్నుల నుంచి తప్పించుకుంటాయి. ఎవరో కొందరు కడుతున్నారు తప్ప.. ధనవంతుల్లో చాలా మంది ఆదాయ పన్నును కట్టడం లేదు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ ఆదాయినిక గండికొడుతునున్నారు. అందుకే పన్నుల వ్యవస్థలో మార్పు రావాలి. ఇప్పుడు మనదేశంలో ఆదాయం ప్రాతిపదికగా కాకుండా.. ఖర్చుల ఆధారంగా పన్నులు వేయాలి. ఆదాయ పన్ను స్థానంలో వ్యయ పన్ను రావాలి. అప్పుడే పారదర్శకత పెరుగుతుంది.

Read: మీ 2021-22 Incometax ఎంతో ఈ లింక్ లో లెక్క కట్టండి 

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 24,23,020 కోట్ల పన్ను రాబడి వచ్చింది. ఇందులో ఆదాయపు పన్ను రూ.6,38,000 (26.30%). కార్పొరేట్ పన్ను వాటా రూ. 6,81,000 కోట్లు (28%). జీఎస్టీ రూ. 6,90,500 (28.5%). ఎక్సైజ్ డ్యూటీ రూ. 2,67,000 కోట్లు (11%). కస్టమ్స్ రూ. 1,38,000 కోట్లు (5.70%), సేవా పన్ను రూ.1,020 కోట్లు (0.045%).

సాధారణం జీతం పొందే ఉద్యోగి మొదట ఆదాయపు పన్ను చెల్లించి.. మిగిలిన డబ్బును ఖర్చు చేసుకునేందుకు వీలుటుంది. కానీ ధనికుల విషయంలో అలా లేదు. మొదట ఖర్చు చేసిన తర్వాత.. మిగిలిన డబ్బుపై ఆదాయ పన్ను చెల్లిస్తారు. అందుకే ఆదాయ పన్ను కాకుండా ఖర్చులపై పన్ను విధిస్తే.. అది సాధారణ పన్ను చెల్లింపుదారుల సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాదు నల్లధనానికి కూడా బ్రేకులు పడతాయి. ఈ విధానం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎంత ఖర్చు చేస్తే అంత పన్ను పడుతుందని గనుక..ప్రజలు పొదుపు వైపు మరలుతారు. విచ్చల విడిగా ఖర్చు చేయరు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అంతేకాదు వ్యక్తిగత పన్నుల వసూళ్లు కూడా పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

Read: 2021-22 FY income tax softwares (KSS PRASAD)

వ్యక్తిగత ఆదాయపు పన్నుకు స్వస్తి చెబితే.. దాదాపు 6.32 లక్షల మంది వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు భారం నుంచి విముక్తి పొందుతారు. ఐటీఆర్ వల్ల కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టార్టప్ కంపెనీలపై భారపడుతోంది. అందుకే ఇది ఎంతో మంది యువ వ్యాపారవేత్తలను నిరుత్సాహపరుస్తోంది. ఆదాయపన్నుకు సంబంధించి ఎన్నో సంక్లిష్టమైన నిబంధనలు కూడా ప్రస్తుతం ఉన్నాయి. ప్రజలు అనేక రికార్డులు చూపించాల్సి ఉటుంది. ఇదంతా వారికి పెద్ద తలనొప్పిగా మారింది. అటు ఆదాయ పన్ను శాఖకు కూడా భారంగా తయారయింది. ఆదాయపు పన్ను శాఖ లక్షలాది రిటర్న్‌లను తనిఖీ చేయడం, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, రీఫండ్‌లు ఇవ్వడం, ఆదాయపు పన్ను చెల్లింపుదారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడం అంత ఈజీ కాదు. ఆదాయ పన్ను స్థానంలో ఖర్చులపై పన్ను వేస్తే.. ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి.

POLLకరోనా పెరుగుతున్న కారణం గా సంక్రాంతి సెలవులు పొడిగించాలి అనుకుంటున్నారా ?

ఒకవేళ వ్యక్తిగత ఆదాయపు పన్నును తీసివేస్తే... TDSలో చేరిన అనేక సంస్థలు రిటర్న్‌లను సేకరించడం, చెల్లించడం, సమర్పించడం వంటి తలనొప్పి చర్యల నుంచి విముక్తి పొందుతాయి. నేడు యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, బెర్ముడా, బ్రూనై మొదలైన అనేక దేశాల్లో ఆదాయ పన్ను లేదు. అక్కడ ఖర్చులపైనే పన్నులు వేస్తున్నారు. కానీ మనదేశంలో అలా లేదు. ఆదాయంపై పన్ను వేస్తున్నారు

భారతదేశంలో ప్రధానంగా మధ్యతరగతి జీతభత్యాల ప్రజలపైనే ఆదాయపు పన్ను భారం పడుతోంది. కానీ సంపన్నుల ఆదాయ వనరులో ప్రధాన భాగం జీతం కాదు. డివిడెండ్, మూలధన లాభాల ద్వారా వారికి ఆదాయం వస్తుంది. ఒకసారి ఆదాయపు పన్ను లెక్కలను పరిశీలిస్తే.. రూ.5 కోట్లుపైగా ఆదాయం ఉన్నవారు దేశ్యవ్యాప్తంగా కేవలం 8,600 మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. 42,800 మంది తమ వార్షిక ఆదాయం కోటి రూపాయలకు మించి ఉన్నట్లు ప్రకటించారు. ఆదాయపు పన్ను శాఖ పేపర్లలో కేవలం 4 లక్షల మంది మాత్రమే వార్షిక ఆదాయం ఏటా రూ.20 లక్షలపైగా ఉంది. కానీ ఈ లెక్కలు చూస్తే.. అవి ఎంత వరకు నిజమో అందరికీ తెలుసు. ఎందుకంటే వందల కోట్లు..వేల కోట్ల డబ్బు సంపాదించే వారు వేలల్లో.. కాదు లక్షల్లోనే ఉన్నారు. ఐతే వారంతా లెక్కలు చూపించకుండా... పన్నుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.

జీతం పొందే వ్యక్తుల నుండి మాత్రమే ఆదాయ పన్ను సక్రమంగా వసూలు అవుతున్నాయి. రెండవ తరగతి వారు ఏదో ఒక విధంగా పన్ను చెల్లించకుండా ఆదా చేస్తారు. జీతభత్యాలు పొందే వర్గంమాత్రం.. మొదట వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించి.. మిగిలిన ఆదాయాన్ని ఖర్చు చేయాలని చెప్పడం కాస్త విడ్డూరంగా ఉంటుంది. మరోవైపు జీతం తీసుకోని వర్గం మొదట తన ఆదాయాన్ని వివిధ మార్గాల్లో ఖర్చు చేస్తుంది. ఆ తర్వాత ఏమీ మిగల్లేదని చూపిస్తారు. ఇక పెద్ద రైతులు ఎలాగూ పన్ను చెల్లించరు. రాజకీయ పార్టీలు కూడా పన్నులు చెల్లించాల్సిన పని లేదు. ఇలా పన్నుల నుంచి సంపన్నవర్గం తప్పించుకుంటుంది.

పన్ను ఎగవేత అనేది మన దేశంలో సర్వ సాధారణమయిపోయింది. పన్ను భారం పడకుండా ప్రణాళిక చేసుకోవచ్చు. కానీ పన్ను ఎగవేత మాత్రం నేరం. వ్యక్తిగత ఆదాయపు పన్నును వ్యయ పన్నుగా మార్చుకుంటే పన్ను ఎగవేసి.. అసలు ఆదాయాన్ని నల్లధనంగా మార్చుకునే అవకాశం ఉండదు. ఈ విధానంతో సామాన్య ప్రజలపై పన్నుల భారం తగ్గడంతో పాటు సంపన్న వర్గాల నుంచి ఆదాయ పన్ను వసూళ్లు పెరుగుతాయి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది.

రచయిత: A.S. మిట్టల్

(రచయిత పంజాబ్ ప్లానింగ్ బోర్డ్ డిప్యూటీ ఛైర్మన్ మరియు అసోచామ్, ఉత్తర ప్రాంతీయ మండలి అధ్యక్షుడు. ఈ ఆర్టికల్‌లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతం.)


SEARCH THIS SITE

LATEST UPDATES

✺ SSC MODEL PAPERS 2022

TRENDING

✺ SSC MODEL PAPERS 2022✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top