Saturday, January 15, 2022

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..? గుండె పనితీరు మందగించి సమస్యల్లో చిక్కుకున్నట్లే..!



 మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..? గుండె పనితీరు మందగించి సమస్యల్లో చిక్కుకున్నట్లే..!

Heart Problem: ఇప్పుడున్న కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, టెన్షన్‌, ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాల వల్ల మనిషికి గుండెకు సంబంధించిన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, దంత, తదితర వ్యాధులు గుండెజబ్బులకు దారితీస్తాయి.

అస్థిరంగా రొమ్మునొప్పి, రక్తపోటు అధికమవటం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే వైద్యున్ని సంప్రదించాలి. కేవలం పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రపంచ హృదయదినోత్సవం ఈ విషయాలపై సామాన్య ప్రజలకు అవగాహన కలిగిస్తుంది. గుండె స‌మ‌స్యల‌పై ప్రజ‌ల‌కు వివ‌రిస్తారు. గుండె వ్యాధులు రావ‌డం, వాటి కార‌ణాలు, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. అయితే వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ సభ్యులు నాలుగు ప్రధాన ప్రమాద కారకాల నియంత్రించడం ద్వారా కనీసం 80 శాతం అకాల మరణాలను తగ్గించవచ్చని పేర్కొంది. ఆ నాలుగు ప్రమాద కారకాలు ఇవే.

తగినంత వ్యాయమం లేకపోవడంతో గుండె పనితీరు మందగింపు:

దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి : 

ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..!
నల్ల ఎండుద్రాక్ష ఆరోగ్యానికి నిధి

ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ... పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

ఆకు కూరలు:

ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి. రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.

ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

చేపలు తింటే ఉపయోగాలెన్నో..

సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.



0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top