Thursday, December 9, 2021

Software Update: ఆ స్మార్ట్‌ఫోన్‌ వాడుతూ అప్‌డేట్ చేసిన వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారట Software Update: ఆ స్మార్ట్‌ఫోన్‌ వాడుతూ అప్‌డేట్ చేద్దామనుకుంటున్నారా..  చేసిన వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారట.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్‌ కంపెనీ ఈ ఏడాది వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో అనే 2 ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను తీసుకొచ్చింది. తాజాగా ఈ ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12 అప్‌డేట్‌ను అందించడం ప్రారంభించింది. అయితే ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నామని వన్‌ప్లస్‌ 9, 9 ప్రో యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో వచ్చే సరికొత్త మార్పులతో మంచి అనుభూతిని పొందాలనుకున్నామని కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా డిసప్పాయింట్ అయ్యామని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.

చదవండి : రూ.10 వేలకే.. అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే

లేటెస్ట్ అప్‌డేట్‌ తర్వాత వన్‌ప్లస్‌ 9 యూజర్లు రకరకాల సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఎక్స్‌డీఏ డెవలపర్స్ (xda developers) ఏజెన్సీ కనుగొంది. ఒక రెడిట్ థ్రెడ్‌లో వన్‌ప్లస్‌ 9 యూజర్లంతా కూడా తమ సమస్యలను పేర్కొన్నట్లు సెక్యూరిటీ రిసెర్చర్లు తెలిపారు. ఆక్సిజన్ఓఎస్ 12 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేశాక ఫోన్ కాల్స్ తో సమస్యలు, స్లో వై-ఫై కనెక్షన్లు, స్మార్ట్‌ఫోన్ ల్యాగింగ్ వంటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నామని రెడిట్ థ్రెడ్‌లో యూజర్లు పేర్కొన్నారు. మరికొంత మంది యూజర్లు గూగుల్ ఫీడ్ డిసేబుల్ చేయడం కుదరక ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఆటో ఫిల్(auto-fill) అనే ఆప్షన్ కూడా వర్క్ కావడం లేదని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. 

చదవండి : జియో కొత్త ప్లాన్లు.. 20శాతం పెరిగిన రేట్లు.. వివరాలు ఇవే!

ఫోన్ యానిమేషన్ కూడా బాగా ల్యాగ్ అవుతోందని కమ్యూనిటీ ఫోరమ్‌లో యూజర్లు పోస్టులు పెట్టారు. ఈ బగ్స్(bugs)పై వన్‌ప్లస్‌ కంపెనీ ఇప్పటివరకైతే అధికారికంగా స్పందించలేదు.ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 12 అప్‌డేట్ భారతదేశం, ఉత్తర అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఐరోపా దేశాల్లోని వన్‌ప్లస్‌ యూజర్లకు కూడా త్వరలోనే ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి రానుంది. “నేను ఐకాన్‌లను ఒక్కొక్కటిగా మార్చలేకపోతున్నాను. నేను స్టేటస్ బార్‌ను పర్సనలైజ్ కూడా చేయలేకపోతున్నాను. నా మెయిన్ స్క్రీన్ గందరగోళంగా ఉంది. కేడబ్ల్యూజీటీ (KWGT) విడ్జెట్‌లు భయంకరంగా ఉన్నాయి. నేను గూగుల్ ఫీడ్‌ని డిసేబుల్ కూడా చేయడానికి కుదరడం లేదు. ఈ అప్‌డేట్‌ తర్వాత ఫోన్ ఘోరంగా మారింది. నేను చాలా నిరాశకు గురయ్యాను." అని రెడిట్ లో ఒక యూజర్ పేర్కొన్నారు.

చదవండి : అదిరిపోయే కొత్త ఫీచర్స్ తో ఈ డిసెంబర్ లో వచ్చిన  స్మార్ట్ ఫోన్లు ఇవే

గతంలో వన్‌ప్లస్‌ 9 సిరీస్ యూజర్లు ఇలాంటి సమస్యలను నివేదించిన తర్వాత మే నెలలో సంస్థ తన మొదటి ఆండ్రాయిడ్ 12 బీటా ప్రోగ్రామ్‌ను నిలిపి వేసింది. అయితే దీన్ని తాజాగా అందరు యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన తరువాత కూడా సాంకేతిక సమస్యలను తొలగించడంలో వన్‌ప్లస్‌ విఫలం కావడం గమనార్హం.

చదవండి : శామ్‌సంగ్‌ గెలాక్సీ మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్లు

ఆక్సిజన్ ఓఎస్ 12 మెరుగైన డార్క్ మోడ్ వంటి ఫీచర్లతో పాటు కొత్త డిజైన్, లుక్ లేఅవుట్‌తో వస్తుంది. డేటా కంటెంట్‌ను సులభంగా చదవడానికి వన్‌ప్లస్‌ కంపెనీ కార్డ్‌ల కోసం షెల్ఫ్‌ను కూడా యాడ్ చేస్తోంది. ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో ఇయర్‌బడ్‌లను కంట్రోల్ చేసేందుకు ఇయర్‌ఫోన్ కంట్రోల్ కార్డ్‌లను కూడా జోడించడం ప్రారంభించింది. గ్యాలరీ, కెమెరా యాప్‌ల్లో గజి బిజీ ఎక్స్పీరియన్స్ లేకుండా రిఫ్రెష్ చేసిన ఇంటర్‌ఫేస్‌ను అందించింది. కానీ వన్‌ప్లస్‌ ఇంకా సమస్యను పరిష్కరించలేదు. అతి త్వరలోనే మరో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో కంపెనీ ఈ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 12 ఇంకా ఇతర వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు విడుదల కాలేదు


SEARCH THIS SITE

LATEST UPDATES

✺ SSC MODEL PAPERS 2022

TRENDING

✺ SSC MODEL PAPERS 2022✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top