INCOME TAX CALCULATION 2021-22 : ఆదాయము పన్ను (2021-2022) లెక్కించు విధానము

 ఆదాయము పన్ను (2021-2022) లెక్కించు విధానము

2021-2022 ఆర్థిక సంవత్సరమునకు Old Regime లో గణన అవగాహన 2 ప్రకారము ది. 1-4-2021 నుండి 31-3-2022 వరకు వర్తించే విధంగా ఆదాయపుపన్ను చట్టము (1961)లో 2021-2022 ఆర్థిక సం॥నకు ఉద్యోగుల జీతాదాయమునకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నవి. వాటిని పరిశీలిద్దాం.


ప్రామాణిక మినహాయింపు (Standard Deduction) – రూ.50,000/- U/s16(i(a)) పన్ను లేదు

LATEST JAYARAM IT 2021-22 SOFTWARE FEB 14

 

IT Latest Softwares download Links : 09.02.2022

Download Ch. Ramana IT Software 2021-22

Download C. Ramanjaneyulu IT Software 2021-22

DOWNLOAD FILE IN TELUGU

INCOMETAX software by KSS PRASAD  updated on Jan 2nd 2022

3. ఆదాయము నుండి పొందగలిగే మినహాయింపులు : 

1) ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పెన్షన్ స్కీమ్ కు సం॥నకు 2 చెల్లించే ప్రీమియం రు.1.5 లక్షల వరకు గరిష్టంగా మినహాయింపు 80CCC ప్రకారం పొందవచ్చు.

2) ది. 1-9-2004 తరువాత నియమించబడిన ఉద్యోగులు NPSకు, CPS క్రింద చెల్లించే మొత్తమును సెక్షన్ 80CCD క్రింద మినహాయింపు, గరిష్టం రూ. 1.5 లక్షలు, 80CCD (D) కింద CPS చందాలో రూ.50,000/-ల వరకు NPSలో పొదువుగా పరిగణించవచ్చు. CPS చందా రూ.50,000/- + 80C+80CCD +80CCD(1) రూ.2 లక్షలు గరిష్టము. 

3)ఆధారితులు వ్యాధిగ్రస్తులై ఉంటే Insurance Premium క్రింద చెల్లించే మొత్తము గరిష్టంగా రూ.25,000/ వరకు సెక్షన్ 80D ప్రకారము అనుమతించబడును. సీనియర్ సిటిజన్ అయితే రూ.50,000/

4) వికలాంగులైన భార్య/భర్త/పిల్లలు ఆధారితులైన సోదరి, సోదరుడు, తల్లి, తండ్రి కొరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం లేక ఖర్చుల క్రింద సెక్షన్ 80DD ప్రకారము రు. 50,000/- నుండి రు.1 లక్ష వరకు (40% వైకల్యముంటేరు. 75,000/- 80% పైనుంటే రు 1.25 లక్షల వరకు) అనుమతించబడును. అయితే 60 సం॥లు పైబడిన సీనియరు సిటిజన్ల మెడికల్ ఇన్సురెన్స్ ప్రీమియం క్రింద అదనముగా రు. 20,000/- వరకు ఆదాయపు పన్నునుండి మినహాయించబడును.

5) సెక్షన్ 80 U క్రింద అంగవికలురుకు 40% వైకల్యము వారికి రు.75,000/-, 80% కలవారికి రు. 1.25,000/- వరకు మినహాయింపు. కన్నా ఎక్కువ వైకల్యము 

6)సెక్షన్ 80E ప్రకారము ఆధారితుల కొరకు మరియు వ్యక్తిగతంగా తీసుకున్న విద్యారుణాలపై 8 సం॥ల వరకు వడ్డీ పూర్తిగా మినహాయింపు. 

7) ఇంటి రుణముపై చెల్లించే వడ్డీ రు. 2,00,000/ వరకు మినహాయింపు కలదు. భార్యాభర్తలు జాయింట్ లోన్ (EMI షేర్ చేసుకొంటే) తీసుకొన్న యెడల ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల వరకు వడ్డీ మినహాయింపు వర్తించును. సెక్షన్ 247 ప్రకారము. ఇంటి పై వచ్చే కిరాయిని ఆదాయంగా చూపితే ఋణముపై వడ్డీ రూ. 2 లక్షల వరకు మినహాయింపు కలదు. 1-4-2019కు ముందు నిర్మించిన ఇళ్ళకు వడ్డీ మినహాయింపు రూ.1.50 లక్షలు. 

4. ఆదాయముగా పరిగణించబడని అంశములు:

1) పదవీ విరమణ తర్వాత పొందే GPF/GIS/APGLI మరియు నగదుగా మార్చుకొన్న సంపాదిత సెలవు, అర్ధజీతపు నెలవు. 

2) కన్వేయన్స్ ఎలవెన్స్ గరిష్టముగా నెలకు రూ.3200, 

3) తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఆధారపడిన సోదర, సోదరీల మరియు స్వంత వైద్యఖర్చులకు పొందిన మెడికల్ రీయింబర్స్మెంట్. 

4) L.T.C. పై పొందిన ప్రయాణ భత్యము. 

5) L.P.G.పై సబ్సిడీ 

6) PF/APGLI లపై అప్పుగా పొందిన సొమ్ము మొ||నవి. 

5. వృత్తిపన్ను: 

ఉద్యోగి సం॥లో చెల్లించిన వృత్తిపన్ను ఆదాయము నుండి పూర్తిగా మినహాయించబడును.

Flash...   ఓమైక్రాన్ అనే మ్యుటేషన్ తీవ్రమైనదా?

6. ఆదాయముగా పరిగణించబడే జీతభత్యములు:- 

Pay, D.A, H.R.A., I.R., CCA, బోనస్, సబ్సిస్టెన్స్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, అదనపు ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవ్ జీతము, సెలవు కాలపు జీతము, PRC బకాయిలు, AAS మొ||నవి ఆదాయముగా పరిగణించబడును. GPF/ZPPF పై వచ్చే వడ్డీ సం॥నకు రూ. 5 లక్షలు మించితే దానిని కూడా ఆదాయముగా 2021-2022 ఆర్థిక సంవత్సరం నుండి పరిగణించబడును. 

7. U/s 87A ప్రకారము టాక్సబుల్ ఇన్ కం (అన్ని మినహాయింపులు పోను తీసివేసిన తరువాత రూ.3.5 లక్షలలోపు ఉంటే గరిష్టముగా రూ.2500/- వరకు రిబేటు కలదు).

8. ఆదాయపు పన్నుకు సంబంధించి ఏఏ ఫారములు సమర్పించాలి?

1) జనవరి, ఫిబ్రవరి మాసములలో calculation sheetతో సహా Form 16 పూర్తిచేసి DDO లకు ఉద్యోగి ఆదాయపు పన్ను పరిధిలోనికి రాకపోయినా “PAN” కార్డును విధిగా పొందాలి. దీని కొరకు దగ్గరలో ఉన్న 1.T. Practitioner ను సంప్రదించాలి. 

2) ఆదాము రూ.5/- లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు, బ్యాంకు, పోస్టాఫీసులలో వడ్డీ ద్వారా రు. 10,000/-ల కంటే ఎక్కువ ఆదాయము కల Salaried Employees మరియు ఒక employer కంటే ఎక్కువ employers వద్ద జీతము పొందువారు “SAHAJ” ఫారములో Returnను 31 జూలై, 2021 లోపు ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ వారికి సమర్పించాలి.

3) DDO e-filing ద్వారా TDS వివరములను I.T. Practioner సహాయముతో (ప్రతి మూడు నెలలకు) onlineలో పంపాలి. యస్.టి.ఓ.ల నుండి BIN తీసుకోవాలి. 

9.డ్రాయింగ్ అధికారుల పరిధిలో లేని మినహాయింపులు:

సెక్షన్ 80G మరియు సెక్షన్ 80DDB క్రింద జమచూపే మినహాయింపులు డ్రాయింగ్ అధికారులు అనుమతించకూడదని, Income Tax Departments Assessing cre Income Tax return (Sahaj) సమర్పించేటపుడు మాత్రమే అనుమతించి, అధికముగా చెల్లించిన మొత్తమును Refund ఇస్తారని I.T. Department -DTA/DDO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినది. (vide E.No. TDS/clarification/ 1011 dt. 15.12.11 of Addl. Commissioner 1. T. Dept., Hyderabad)

80G: P.M రిలీఫ్ ఫండ్, C. M. రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు తప్ప 80G క్రిందకు వచ్చే 50%/ 30% మినహాయింపు పరిధిలోకి వచ్చే ఏ ఇతర చందాలను DDO అనుమతించరాదు.

గమనిక:- 80G మినహాయించక ముందు, నికర ఆదాయములో 10% కన్నా ఎక్కువ సొమ్మును 80G క్రింద వర్తించే చందాలుగా అనుమతించరాదు.

80DDB:– Cancer, Talassemia, Haemophilia, Numerolological disleases, Aids Zoom Chronic Renal Failure వంటి ప్రాణాంతక వ్యాధులతో సంబంధిత ఆర్థిక సం॥లో బాధపడుతున్నవారు మరియు వారిపై ఆధారపడిన తల్లి, తండ్రి, భార్య/భర్త, పిల్లలు, సోదరుడు, సోదరి వారికి వైద్యఖర్చుల నిమిత్తము రు.60,000/ (60సం॥ పైబడితే రు. 80,000/-) వరకు సెక్షన్ 80DDB కింద మినహాయింపు కలదు. Form 10-1 లో ప్రభుత్వ Hospitalsలో పనిచేసే Specialist Doctors చే ఖర్చుల వివరములతో సహా గల ధృవపత్రము ఉంటేనే ఈ మినహాయింపు వరిస్తుంది. ఈ మినహాయింపు IT Dept. Assesing Officer పరిధిలోనిది. (DDO పరిధిలోకి తెచ్చుటకు ప్రాతినిధ్యం చేయాలి).

10. పొదుపు పథకాలలో నిల్వకు రూ.1.5 లక్ష వరకు అనుమతి :

పొదుపు పథకాలైన GPF, ZPPF, PLI, LIC, GIS, CPS, NSC, APGLI, IPPF, KVP, SBI Life, ఇంటిరుణంపై చెల్లించు అసలు మరియు ఇద్దరు పిల్లలకు ఏ తరగతి వరకైనా చెల్లించిన ట్యూషన్ ఫీజు మొదలైన వాటికి సెక్షన్ 80C ప్రకారము గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేయుటకు అనుమతించబడినది. 80C, 80CCలలో కలిపి రూ.1,50,000/-ల వరకు పొదుపు పథకాలలో జమకు అనుమతించబడును. 

Flash...   Common Admission Test: అభ్యర్థులకు అలర్ట్.. CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ : కేంద్రప్రభుత్వము ప్రకటించిన ఈ స్కీమ్లో పొదుపు చేసిన సొమ్ములో 50% గరిష్టముగా రూ.25,000/- (పొదుపు రూ.50,000/-ల) వరకు సెక్షన్ 80CCG క్రింద అదనముగా పొదుపు చేయుటకు అనుమతించబడినది. అనగా 80C, 80CC, 80CCD, 80CCG క్రింద మొత్తము -రూ. 1,75,000/-ల వరకు పొదుపు పధకాలలో జమచేయుటకు అనుమతించబడును.

నూతన పెన్షన్ పథకము క్రింద చెల్లించే ప్రభుత్వ వాటా గరిష్టముగా 10% “పొదుపు పథకము క్రింద వర్తించబడదు. ఆదాయముగా పరిగణించబడును.

11. H.R.A. మినహాయింపు ఫార్ములా :-

ఈ క్రింది వానిలో ఏది తక్కువైతే అంత ఆదాయము నుండి మినహాయింపు పొందవచ్చును. 

1) ఇంటి అద్దె భత్యముగా పొందిన మొత్తము, 

2) ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తము 10% మూల వేతనము, (రాష్ట్ర ప్రభుత్వ OPS ఉద్యోగులకు కరువు భత్యం పింఛను పరిగణించబడదు. కనుక డి.ఏ.ను కలుపనవసరము లేదు.) 

3) 50% వేతనము (మెట్రో నగరములు), 40% వేతనము (పట్టణాలు, గ్రామాలు)

Note:

1) ఇంటి అద్దె అలవెన్సు (ఇంటి అద్దె కాదు) నెలకు రూ. 3000/- కన్నా (సం॥నకు సరాసరి రూ.36,000/లు) ఎక్కువ పొందుతున్నవారు, దానికి మినహాయింపు పొందాలంటే విధిగా “ఇంటి అద్దె రశీదు” DDOకు సమర్పించాలి. 

2) స్వంత ఇంట్లో నివసించువారికి HRA మినహాయింపు వర్తించదు.

3) వార్షిక ఇంటి అద్దె 1 లక్ష కంటే ఎక్కువైన ఇంటి యజమాని పేరు పాన్ సమర్పించుట తప్పనిసరి.

12. ఆదాయము పన్నును ఎట్లు చెల్లించవచ్చు?

ఆదాయపు పన్నును శ్లాబుల కనుగుణంగా తాత్కాలికంగా మదింపుచేసుకొన్నచో సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలియును. ఈ మొత్తమును ప్రతి నెలలో కొంత చొ॥న ఉద్యోగి ప్రణాళికాబద్ధంగా online జీతాల బిల్లులో – మినహాయించుకొన్నచో జనవరి, ఫిబ్రవరి మాసములలో అధికభారము పడకుండా ఉండును. ప్రతినెల DDO నుండి IT మినహాయించిన షెడ్యూల్ను (C.F.M.S. Bill No. మరియు తేదీతో సహా) తీసుకొని భద్రపరచుకోవాలి. జనవరి నెలలో ఆదాయపు పన్నును Form-16 ప్రకారము మదింపు చేసుకొని అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటే ఫిబ్రవరి 2021 నెలలో మినహాయించుకోవచ్చును. షెడ్యూల్లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి.

ఆదాయపు పన్నును సక్రమంగా చెల్లించుట ప్రతి పౌరుని సామాజిక, రాజ్యాంగ బాధ్యత, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ఉద్యోగ వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము. 

13. U/s 139 ప్రకారము 75 సం||ల వయస్సు కన్నా ఎక్కువ ఉన్న సీనియర్ సిటిజన్లు తమ ఆదాయము, పెన్షన్ మరియు బ్యాంకు వడ్డీ మాత్రమే అయి ఉన్నచో ఐ.టి. రిటన్ సమర్పించకుండా ఉండుటకు ఆప్షన్ ఉన్నది. బ్యాంకుకు ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఈ అవకాశము 2021-2022 ఆర్థిక సంవత్సరము నుండి నూతనంగా కల్పించబడినది.

ఒక దేశం రెండు రకాల ఆదాయపన్ను మదింపు 

(NEW INCOME TAX REGIME U/S 115 BAC)

భారత ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో ఆదాయపన్ను చట్టం 1961లో ‘115 BAC’ అనే కొత్త సెక్షనన్ను నూతనంగా పొందుపరచినది. దీనినే New Income Tax Regime అంటారు. పాత ఆదాయపన్ను గణన 2019-20ను అలాగే ఉంచుతూ ఈ New Regimeను హిందూ అవిభాజ్య కుటుంబాల వ్యక్తుల ఆదాయపన్ను మదింపును ఐచ్చికంగా అనుసరించుటకు వీలుగా ఈ నూతన సెక్షన్ కల్పించింది. ఈ నూతన సెక్షన్లో ఆదాయపన్ను శ్లాబును ప్రస్తుతం ఉన్న 5 స్లాబ్ నుండి 7 స్లాబ్లకు పెంచినది. అయితే వ్యాపార పరంగా వచ్చిన ఆదాయంనుకు ఈ నూతన విధానం వర్తించదు. ఈ సెక్షన్ వలన వ్యక్తులకు నికర ఆదాయం 5 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు రూ. 5 లక్షల నికర ఆదాయం ఉన్న వారికి గరిష్టంగా రూ.12,500 వరకు రిబేట్ను U/S 87Aద్వారా కల్పించబడినది సీనియర్ సిటిజెన్స్ 80 సం॥ వయస్సు పై బడిన వారికి 5 లక్షల వరకు పన్ను ఉండదు. 

Flash...   SBI లోన్ మారటోరియం అర్హతలు.. రుణగ్రహీతలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

Health Education Cess @ 4% on IT to be paid After rebate U/s 87A

Tax rebate of Rs 12500 upto 5 Laks U/s 87 A HRA Standard deduction U/s 80D, 80 DDB, 80E, 80EE, 80C, Housing Loan interest tuition Fee, PF Donations to PMRF/CMRF will be DISALLOWED.

Dedication allowed in New Regime (అనుమతించే మినహాయింపులు)

1) 80 CCD క్రింద ‘CPS/NPS’ కు చెల్లించిన చందాలు

 2) కన్వెయన్స్ అలవెన్స్

3. ప్రయాణ/టూర్/బదిలీలకు సంబంధించిన అలవెన్స్

 4. Daily Allowance

3. Deducation Disallowed in New Regime (అనుమతించని మినహాయింపులు)

a) Standard Dedication

b) HRA

C) గృహ బుణాలు మీద వడ్డీ

d) లీవ్ ట్రావెల్ అలవెన్స్

e) వృత్తి పన్ను ప్రీమియం. 

f) విద్యా బుణాల INTEREST (w/s 80E)

g) సెక్షన్ 80 C క్రింద LIC

h) PF, 

i) ట్యూషన్ ఫీజులు, 

j) APGLIC & GIS & PLI & NSS వంటి వాటికి చేసిన చెల్లింపులు 

k) ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సహాయనిధి మరియు చారిటబుల్ ట్రస్ట్లకు సెక్షన్ 80 జి క్రింద ఇచ్చే విరాళాలు, 

l) ఆరోగ్య కార్డ్/హెల్త్ ఇన్సూరెన్స్కు చెల్లించిన ప్రీమియం, 

m) 80DDB సెక్షన్ క్రింద చెల్లించిన వైద్య ఖర్చులు మొ॥

4. ఈ New Regime కింద ఆదాయపన్ను మదింపు పూర్తిగా ఐచ్చికం DDO లకు ముందుగా ఏ IT (పాత /నూతన) విధానముతో ఆదాయపు పన్ను మదింపు వేస్తున్నారో తెలియజేయవలయును జూలైలో IT వారికి ఈ-ఫైలింగ్ ద్వారా రిటర్న్ దాఖలు చేయునప్పుడు కూడా చివరిసారిగా Regimeను మార్చుకొను సౌలభ్యం కూడా కలదు. 

5. 2021-22 05 Son Soo New Regime 6 Pay+DA+HRA+IR+Additional Increments+ Allowances (Gross Salary మొత్తము)తో పాటు GPF/ZPPFలో 5లక్షలకు పై వచ్చే వడ్డీను కూడా ఆదాయముగా పరిగణిస్తారు.

6.  రూ.5 లక్షలలోపు ఆదాయము ఉన్నవారికి రూ. 1000/- చొప్పున, ఆపై ఆదాయము ఉన్నవారికి చొప్పున ఇన్ కంటాక్స్ ఫైలింగ్ లేట్ ఫీజును వసూలు చేయబడును. (U/s. 139) 

ఏ Regime మంచిది ? 

1.రూ.5000/ పాత, నూతన ఆదాయ పన్ను మదింపు విధానాలలో ఏది మంచిది అని చెప్పటానికి ఏ రకమైన ఫార్ములా లేదు. 1. 6 లక్షల లోపు ఆదాయం పొందు CPS ఉద్యోగులకు కొత్త Regimeను ఎన్నుకొనుట శ్రేయస్కరం. 

2. గృహ బుణాలు, PF, స్టడీ లోన్స్ తదితర సేవింగ్స్ ఉన్న వారికి Old Regime మంచిది 

3. Old Regime లో 50,000 రూపాయలు Standard Deductions అవకాశం ఉన్నది. కనుక Old Regime మంచిది. 

4.రెండు విధానాలలో ఆదాయపన్ను మదింపు చేసుకొని ఏది మంచిదో నిర్ణయం తీసుకునుట శుభప్రదం. 

60 సం||ల వయస్సులోపు ఉద్యోగికి OLD/NEW లో ఆదాయ పన్ను మదింపు

DOWNLOAD FILE IN TELUGU


DOWNLAOD INCOME TAX SOFTWARES