Thursday, December 9, 2021

Fenugreek: (షుగర్ )మధుమేహానికి మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే.Fenugreek: బీపీనో మరొకటో వస్తే కంట్రోల్ చేసుకోవచ్చేమో కానీ మధుమేహం (డయాబెటిస్) వస్తే అన్నీ సమస్యలే అని ఆందోళన పడిపోతుంటారు


Fenugreek: బీపీనో మరొకటో వస్తే కంట్రోల్ చేసుకోవచ్చేమో కానీ మధుమేహం (డయాబెటిస్) వస్తే అన్నీ సమస్యలే అని ఆందోళన పడిపోతుంటారు చక్కెర వ్యాధిగ్రస్తులు. జీన్స్ వల్ల కానీ, జీవన శైలి కారణంగా కానీ మధుమేహం బారిన పడుతుంటారు చాలా మంది. డాక్టర్ ఇచ్చే మందులతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మదుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతిగింజలు బాగా ఉపయోగపడతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.

చదవండి: వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం

కొన్ని అధ్యయనాలు మెంతులు చక్కెరను తగ్గించేందుకు సమర్ధవంతంగా ఉపయోగపడతాయని పేర్కొంటున్నాయి. 2009లో జరిగిన ఓ అధ్యయనంలో రాత్రిపూట నీటిలో నానబెట్టిన 10గ్రాముల మెంతి గింజలు టైప్ 2 డయాబెటిస్‌ను నియత్రిస్తుందని తెలిపింది. గర్భిణీ స్త్రీలు మెంతులు ఉపయోగించకూడదని పేర్కొంది. మెంతులు కూడా అలెర్జీకి కారణమవుతాయి. మీ ఆహారంలో మెంతులు చేర్చుకునే ముందు మీకు ఆహార సంబంధిత అలెర్జీలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకుని ఉపయోగించాలి.

చదవండి: స్నానం చివరలో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందట.

వంటలో ఉపయోగించే మెంతులు సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అలాగని ఎక్కువ మోతాదులో శరీరంపై దుష్ప్రభావాలు చూపిస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెంతి గింజలు చేదు, వగరు రుచిని కలిగి ఉంటాయి. పెరుగులో మెంతిపొడి కలుపుకొని తినవచ్చు. లేదా మజ్జిగలో ఓ స్పూన్ మెంతి పొడి వేసుకుని తాగవచ్చు. మరో అధ్యయనం ప్రకారం మెంతులు క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయని, యాంటీకాన్సర్ హెర్బ్‌గా పనిచేస్తాయని సూచిస్తుంది. మెంతులు ఋతు చక్ర సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని తగ్గిస్తాయి.

చదవండి: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ... పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

జీవనశైలిలో మార్పులు చేయడం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడవచ్చు. ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. తృణధాన్యాలు, కూరగాయలు, తాజా పండ్లు వంటి వాటిని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వును తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఆహారాలు, తియ్యటి పానీయాలకు దూరంగా ఉండాలి. రోజుకు కనీసం అరగంట, వారానికి 5 రోజులు ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిగా చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలి. పైన పేర్కొన్న ఇన్ఫర్మేషన్ అంతర్జాలంలో సూచించిన సమాచారం మేరకు, అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. అంతే కాని వైద్యుల ఔషధాలకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.

చదవండి: చలికాలంలో బెల్లం టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు...


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top