'ప్రభుత్వాన్నే కూల్చేస్తాం..' CM జగన్‌పై AP NGO అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

 'ప్రభుత్వాన్నే కూల్చేస్తాం..' సీఎం జగన్‌పై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరుపై ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటూ.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఎప్పిన మాయ మాటలు విని 151 సీట్లు తీసుకొని వచ్చాం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. అలాంటిదే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‍లు.. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఏపీ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.. ఒక్కొక్క ఉద్యోగికి ఐదు ఓట్లు ఉంటాయి.. ఈ లెక్కన 60 లక్షల మంది ప్రభుత్వాన్ని కూల్చొచ్చు.. ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు.. ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే..' అంటూ బండి శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రైతుల ఉద్యమానికి సైతం ప్రధానమంత్రి దిగివచ్చారని ఆయన అన్నారు. ఈ రోజు మనం చేసే ఉద్యమం.. భావి తరాల కోసమన్నారు. ఉద్యమాల ద్వారా హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు పాల వారి దగ్గర, కూరగాయల వారి దగ్గర లోకువై పోయారని బండి శ్రీనివాసులు అన్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad