Thursday, December 9, 2021

ఎలిమినేటి మాధవరెడ్డి ఎవరు?? అసలు ఎలిమినేటి మాధవరెడ్డి ఎవరు??

ఎలిమినేటి మాధవరెడ్డి పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదుపేస్తున్న పేరు. రెండువేల సంవత్సరంలో ముందు రాజకీయాలను పరిశీలించిన వారికి మాధవరెడ్డి సుపరిచితమే. తెలంగాణలోనే టీడీపీ కి అతిపెద్ద నాయకుడిగా అవతరించారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ లో చేరిన నాయకుడు. అయితే మాధవరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో నక్సలైట్ సానుభూతిపరులతో కలిసి స్నేహం చేసి చదువుతున్నాడో వారినే ఏది పారేశారు? మెరుపులా వచ్చిన మాధవరెడ్డి నక్సల్స్ బాంబు బ్లాస్ట్ లో ఎలా చనిపోయారు అనేది చూద్దాం. ఎలిమినేటి మాధవరెడ్డి మే ఒకటి పంతొమ్మిది వందల నలబై తొమ్మిదిన భువనగిరికి దగ్గరలోని వనపర్తి అనే గ్రామంలో పుట్టారు.

అతని తల్లితండ్రులు నరసింహారెడ్డి, లక్ష్మమ్మ లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ లో ఎలక్ట్రికల్ చదివిన ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఉస్మానియాలో ఆనాడు సామాజిక అంశాల మీద ఎక్కువ చర్చలు జరిగేవి. నాయకులు అక్కడి నుంచి వచ్చేవారు. అంతేకాదు నక్సలైట్లు సానుభూతిపరుల నుంచి ఇన్ఫర్మల్ కూడా క్యాంపస్ లో ఉండేవారు. మంచి మార్కులతో ఉస్మానియా లో సీటు సంపాదించి బయటకి వచ్చే సమయానికి రాజకీయాలకు దగ్గర అయ్యేవారు విద్యార్థులు. ఇటు మాధవరెడ్డి కూడా రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇక ఇంజనీరింగ్ పూర్తి కాగానే పంతొమ్మిది వందల డెబ్బై లో ఉమాదేవిని పెళ్లి చేసుకున్నారు మాధవరెడ్డి. వీరికి సృజనా సంధి, శ్వేత సంతానం

కూతుర్లు, వ్యాపారస్తులు ఉన్న పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సంధి రాజకీయాల్లోకి వచ్చిన అదృష్టం కలిసి రాక వెనుకబడ్డారు. ఇక రాజకీయాలపై ఆసక్తి ఉన్న మొదట ఆర్థికంగా బలంగా లేకపోవడంతో వ్యాపారం వైపు మొగ్గు చూపారు. మాధవరెడ్డి మొదట ఎరువుల దుకాణం పెట్టుకొని కాలం వెళ్లి తీశారు. అయితే భువనగిరి కొండల్లో విపరీతమైన గ్రానైట్ ఉండడంతో వాటికీ అనుమతులు సంపాదించి ఆర్థికంగా బలపడ్డారు. అంతేకాదు రాజకీయ నాయకులతో పరిచయాలు ఆయనను ముందడుగు వేసేలా చేశాయి. అయితే వనపర్తిలో కాంగ్రెస్ నాయకుల పలుకుబడి ఉండేది. వారికి ఎదురొడ్డి గ్రామంలో మంచి పేరు తెచ్చుకొని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

మాధవరెడ్డి ఎన్నికల్లో నిలబడ్డ తర్వాత ఆయనకు ఎదురు ఉండేది కాదు. మంచి మనిషి పైగా నిర్మలమైన మనస్తత్వం గల వ్యక్తిగా పేరు అసలు కోపం అనేదే ఆయనకు తెలియదు. పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వనపర్తి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. వామపక్ష పార్టీ సానుభూతి పరులుగా ఉన్న మాధవరెడ్డి నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఆయనకు భువన గిరి మండలంలో ఉన్న పేరు, పలుకుబడి ఎన్టీఆర్ కి తెలియడంతో తాను పోటీ చేస్తానని రెండు మూడు సార్లు అడగగానే గెలిచి రండి బ్రదర్ అని దీవించారు. అంట ఎన్టీఆర్, ఆ టైమ్ లోనే కాంగ్రెస్ కంచుకోట గా ఉన్న ఉమ్మడి నల్గొండలో జానారెడ్డి, మాధవ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆకారపు సుదర్శన్, మోత్కుపల్లి నరసింహులు, చంద్రరావు లాంటి హేమాహేమీలు తెలుగుదేశానికి బలమైన జిల్లాగా మార్చారు.

అంతెందుకు హోంమంత్రి అయితే నల్గొండ నుంచే కావాలనే కాంగ్రెస్ ట్రెండ్ టీడీపీ కూడా కొనసాగించింది. సర్పంచ్ అయినా ఏడాదికే తెలుగుదేశంలో అంటే పంతొమ్మిది వందల ఎనబై రెండు లో చేరారు. మోత్కుపల్లి నరసింహులు మాధవరెడ్డి కెసిఆర్ అటు ఇటుగా ఒకేసారి టీడీపీ లో చేరారు. ఒకేసారి గెలిచారు కూడా. చురుకైన యువకులను ప్రోత్సహించిన ఎన్టీఆర్ వయసుతో సంబంధం లేకుండా టాలెంట్ చూసి పదవులు ఇచ్చారు. టీడీపీ బ్రహ్మాండమైన మెజారిటీ గెలవడంతో మాధవ రెడ్డి అధికార పార్టీ ని ఉపయోగించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద నాయకుడిగా ఎదిగారు. అయితే తర్వాత జానారెడ్డి పార్టీ వెళ్లడంతో మాధవరెడ్డి కి తిరుగు లేకుండా పోయింది. ఇక మొదట హోంమంత్రిగా మాధవరెడ్డి ఎంపిక చేశారు. రెండవసారి సీఎం అయినప్పుడు పంతొమ్మిది వందల తొంబై నాలుగులో ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి చేశారు.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top