మీ ఫోన్లో ఈ యాప్ లు ఉంటే.. బ్యాంకు ఖాతాలో సొమ్ము ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త!
యాండ్రాయిడ్ ఫోన్లను వాడటం ఎంత సులభమో..కొన్నిసార్లు అంత ప్రమాదకరం. తెలిసితెలియక వేసుకునే యాప్ ల వల్ల కొందరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ప్లే స్టోర్ లో కొన్ని డేంజర్స్ యాప్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. కొన్ని యాప్ లు మన డేటాను తస్కరిస్తే..మరికొన్ని యాప్ లు మన బ్యాంక్ ఖాతాలో సొమ్మును స్వాహా చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయో యాప్ లు మీ ఫోన్ లో ఉన్నట్లయితే..వెంటనే వాటిని డిలిట్ చేయండి. ఈ మేరకు థ్రెట్‌ఫ్యాబ్రిక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోన్ యూజర్లను హెచ్చరించింది.
Also Read: మెరుపు చార్జింగ్ వేగంతో రానున్న మొబైల్!.. రికార్డులు బద్దలే
ఫోన్ యూజర్స్ ప్లేస్టోర్ నుంచి యాప్‌లు డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని థ్రెట్‌ఫ్యాబ్రిక్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూజర్ల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తున్న యాప్‌లను సుమారు 3 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసినట్లు తెలిపారు. హ్యాకర్స్.. గూగుల్ ప్లేస్టోర్ సెక్యూరిటీని అతిక్రమించి ట్రోజన్ మాల్వేర్ను యాప్‌లలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
ఈ కేటగిరీ యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు యూజర్స్ రివ్యూలను జాగ్రత్తగా చదవాలని నిపుణులు అంటున్నారు. ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆకర్షణీమయైన ప్రకటనలతో యూజర్స్‌ను ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రకటనల వెనుక మోసం గురించి తెలియని యూజర్స్ ఆ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని థ్రెట్‌ఫ్యాబ్రిక్ పేర్కొంది.
ట్విస్ట్ : ఉద్యోగుల PRCపై బిగ్ ట్విస్ట్
ఈ యాప్ లు నాలుగు మాల్ వేర్ ఫ్యామిలీలకు చెందినవని నిపుణులు చెప్పారు. Anatsa, Alien, Hydra, Ermac. యూజర్ల ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్స్ చోరీ చేసేందుకు ఈ యాప్స్ డిజైన్ చేసినట్టు వివరించారు. అంతేకాదు టూ ఫ్యాక్టర్ అతెంటికేషన్ కోడ్స్ కూడా తస్కరిస్తాయట. అలాగే యూజర్ టైప్ చేసే వాటిని కూడా మాల్ వేర్ క్యాప్చర్ చేస్తుంది. యూజర్ ఫోన్ స్క్రీన్ షాట్స్ తీస్తుంది.
యూజర్ల బ్యాంకు ఖాతా వివరాలు తస్కరిస్తున్న మొత్తం 12 ప్రమాదకర యాండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ గుర్తించింది. థ్రెట్‌ఫ్యాబ్రిక్ సంస్థ ప్రకారం ఈ యాప్స్ ను 3లక్షల సార్లు డౌన్ లోడ్ చేశారు.
చదవండి : AP ప్రజలకు శుభవార్త
గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న ప్రమాదకర యాప్ లు..
➧ Protection Guard
➧ QR CreatorScanner
➧ Master Scanner Live
➧ CryptoTracker
➧ Gym and Fitness Trainer
➧ PDF Document Scanner
➧ Two Factor Authenticator
➧ QR Scanner
➧ QR Scanner 2021
➧ PDF Document Scanner Free
ఈ యాప్స్ మీ ఫోనులో ఉన్నట్లయితే వెంటనే డిలీట్ చేసేయండి. అంతేకాదు..కొత్తగా ఏ యాప్ అయినా ఫోనులో వేసుకున్నట్లైతే కింద రివ్యూస్ జాగ్రత్తగా చదివి ఆపైనే డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.