Sunday, December 26, 2021

AP PRC : తెల్చుడా .... నాన్చుడా ..జనవరిలోనే ప్రకటన• వీడని పీఆర్సీ చిక్కుముడి ..సీఎం పిలుపు కోసం ఎదురుచూపులు

• ఫిట్మెంట్పై స్పష్టత కోసం పట్టు • తేలకపోతే మళ్లీ ఉద్యమబాట

• మా బాధలు సీఎంకు చెబుతున్నారా? ఉద్యోగ సంఘాల నేతల్లో సందేహం

• న్యూ ఇయర్ డే లేదా సంక్రాంతికి తీపి కబురు 

• ప్రభుత్వ పెద్దల యోచన! 


అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యో గుల మధ్య పీఆర్సీ అంతరం రోజురోజుకూ పెరిగిపోయేలా "నిపిస్తోంది. ఇప్పటికే నాలుగు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోగా అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగ సంఘాలకు ఈ అంశంపై ఎవరికీ స్పష్టత రాలేదు. దీంతో అసలు ఈ నాలుగు దఫాల చర్చల్లో తాము చెప్పిన అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా.. లేదా.. అంటూ ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇతే అంశాన్ని ఈ నెల 22న జరిగిన చర్చల్లో ప్రభుత్వ పెద్దలను ఉద్యోగ సంఘాలు ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై వారు మాట్లాడకపోవడంతో ఉద్యోగ సంఘాలు తమ సమస్యలు సీఎం జగన్ దృష్టికి వెళ్లలేదని భావించి ఈనెల 24వ తేదీన ష్ట్రగుల్ కమిటీ సమావేశం నిర్వహించాయి. 22వతేదీన చర్చల సందర్భంగా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ముఖ్య మంత్రి జగన్ తమ చర్చలు జరిగితే సరేసరి.. లేదంటే మళ్లీ ఉద్యమ బాట పట్టడం ఒక్కటే మార్గమని ఉద్యోగ సంఘాలు ఒ క నిర్ణయానికి వచ్చాయి. ఈనేపథ్యంలో అటు ప్రభుత్వం లోనూ ఇటు ఉద్యోగ సంఘాల్లోనూ ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది.

సీఎంకు అన్నీ చెబుతున్నారా ?

తమతో ఇప్పటివరకూ జరిగిన నాలుగు సమావేశాల సారాంశం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్లు కనిపించడం లేదని ఉద్యోగ సంఘ నేతలు అనుమానిస్తున్న అంశంలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ఇప్పటికే ప్ర భుత్వ సలహాదారు సజ్జల, ఆర్థిక మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ రెండు దపాలుగా సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీల్లో ఉద్యోగ సంఘాల మనోభావాలను సీఎం జగన్కు పూర్తిస్థాయిలో అర్ధమయ్యే రీతిలో వివరించినట్లు చెప్పారు. అయితే, అందరికీ అన్నీ ఇస్తున్న సీఎం జగన్ తన దృష్టికి వచ్చిన ఇంతటి సున్నితమైన అంశంపై నిర్ణయం తీసుకోకుండా ఉండే అవకా శమే లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దీంతో సీఎం జగన్కు ప్రభుత్వ పెద్దలు ఏం నివేదించారన్న దానిపై ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

READ: కొత్త PRC లో మీ బేసిక్ పే ఎంతో తెలుసుకోండి 

జనవరిలోనే ప్రకటన

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సమ్యను అటు ఉద్యోగ సంఘాలను ఒప్పించేలా, ఇటు రాష్ట్రంపై మరింత భారం పడకుండా ఉండేలా చేయాలంటే ఒకటి రెండు రోజుల్లో తేలేట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇటీవల భారీ వరదలవల్ల నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన సమయంలో అక్కడ ఆయన్ను కలిసిన ఉద్యోగులకు వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తామని హామీ ఇచ్చారు. ఆనాటి నుండి ఆయన తనకున్న సమయంలోనే మూడు, నాలుగు సార్లు ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో పీఆర్సీ అంశంపై చర్చించారు. ఈ క్రమంలోనే ఒక డీఏను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పీఆర్సీపై సంక్రాంతిలోపు దీనిపై ఒక ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే జనవరి 1వ తేదీన పీఆర్సీపై ప్రకనట ఉండే అవకాశముందని సీఎంవో వర్గాలు పేర్కొంటున్నాయి.

READ: మీ నెలసరి జీతం వివరాలు తెలుసుకోండి 

IR తగ్గకుండా...మధ్యేమార్గం? 

ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నారు. ఈ ఐఆర్కు తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండగా ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం 14.29 ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సచివాలయ ఉద్యోగ సంఘాల నేత 34 శాతానికి ఓకే అంటూ ప్రకటన చేశారు. ఇప్పు డు అది ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని మరింతగా పెంచేదిగా కనిపిస్తోంది. అయితే, ప్రభుత్వం 34 శాతం ఇచ్చి హెచ్ఐర్ఎను నాలుగు శాతం తగ్గించే అవకాశం కనిపిస్తోందన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. దానికన్నా 30 శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులకు వచ్చే మరే ఇతర అలవెన్సుల్లోనూ కోత పెట్టకుండా ఉంటే ప్రస్తుతం తీసుకుంటున్న జీతం కంటే 3 శాతం అదనంగా ఇచ్చినట్లవుతుందని మరొక ప్రచారం. జరుగుతోంది. అలా అయితే పక్కన ఉన్న తెలంగాణ ప్రభు త్వం ఇచ్చిన 30 శాతాన్నే తాము కూడా ఇచ్చామని చెప్పుకునే అవకాశం ప్రభుత్వానికి ఉటుందని, దానికి ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నా రన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

READ: పెరిగిన కొత్త DA తో మీ జీతం ఎంత పెరిగిందో తెలుసుకోండి 

సీఎంతో భేటీపైనే ఆశలన్నీ....

ఈనెల 22వ తేదీన జరిగిన చర్చల సందర్భంగా వారం లోగా ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఈ హా మీ ఇచ్చి ఇప్పటికే నాలుగు రోజులు పూర్తయింది. ఆది వారం తీసేస్తే ఇక మిగిలింది కేవలం రెండు రోజులు మా త్రమే. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి కూడా క్రిస్మస్ తరువాత పీఆర్సీపై ప్రకటన వెలువడే అవకాశముందని హామీ ఇచ్చారు. ఈనేపథ్యం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఈరోజు, రేపట్లో తమ సమావేశం ఉండే అవకాశముం దని ఉద్యోగ సం ఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా పీఆర్సీ ప్రకటనతోపాటు పెండింగ్ సమ స్యలపై ఉద్యోగ సంఘాల నేతలుగా తాము ఉద్యోగులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఉద్యోగ సంఘ నేతలు వాపోతున్నారు. ఈనేపథ్యంలో సీఎం జగన్ భేటీ జరిగితేనే ఈ అంశాలపై ఒక స్పష్టత వస్తుందని, అప్పుడే తాము కూడా ఉద్యోగులకు సమా ధానం చెప్పుకునే అవ కాశముంటుందని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు.

READ: మీకు రావలసిన 3 డీఏ బకాయిలు ఎంతెంతో మీ పేరు మీద పిడిఎఫ్ గా తెలుసుకోండి 


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top