Tuesday, November 9, 2021

WINTER లో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోడానికి మహిళలు ఈ ఆహారం తీసుకుంటే మంచిదట..!WINTER లో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోడానికి మహిళలు ఈ ఆహారం  తీసుకుంటే మంచిదట..!

ప్రకృతికి మనిషికి దగ్గర సంబంధం ఉంటుంది. సీజన్లో వచ్చే మార్పులు వల్ల మనలో కూడా changes  వస్తుంటాయి. అందుకే ఏ సీజన్ కు ఏం తినాలో అవితింటే ఆ సీజన్ లో వచ్చే రోగాల బారినపడకుండా ఉండొచ్చు. Winterలో వేడి ఉండడు..ఆ చల్లటి గాలికి చాలామందికి సమస్యలు వస్తుంటాయి. సైనస్ తో బాధపడేవారైతే..ఉదయం బయటకురావాలంటే భయపడిపోతారు. Winterలో తినే ఆహారం విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే వయసు పై బడుతున్న కొద్ది మహిళలు శరీరానికి అధికపోషకాలు అందించాల్సి ఉంటుంది. Winterలో వచ్చే ఛేంజెస్ వల్ల మహిళల శరీరంలో చర్మం, జుట్టు, ఎముకులకు సంబంధించి సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్ల వయసున్న మహిళల వెన్ను, కాళ్లలో నొప్పి సమస్యలు ఎక్కువుగా ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించటానికి ముఖ్యంగా ఏం తినాలో ఇప్పుడు చూద్దాం.

1. విటమిన్ సి: Winter లో vitamin C చాలాముఖ్యం. ఇది immunity  పెంపొందిస్తుంది. అందుకని నారింజ, నిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన citrus పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.. వీటిల్లో vitamin C పుష్కలంగా ఉంటుంది. vitamin C చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. చలికాలంలో వ‌చ్చే వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది

2. గంజి: గంజి మంచి అల్పాహారం. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం వరకూ ఆకలి వేయకుండా చేస్తుంది. గంజిలో అదనపు రుచి కోసం.. డ్రై ఫ్రూట్స్‌ జోడిస్తే.. మంచి రుచితో పాటు.. ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన పెద్దోళ్లు గంజితాగే చాలా బలంగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడంతా కుక్కర్స్ వచ్చేశాయ్ కదా..గంజి ఎవరూ చేసుకోవటం లేదు. కానీ గంజితాగటం మాత్రం ఆరోగ్యానికి చాలా మేలు.

3. రాగులు: రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు రాగులతో చేసిన ఆహారం తప్పనిసరిగా తినాలట. మధుమేహం, రక్తహీనత రోగులు రాగుల తినే ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి పరిస్థితులపై పోరాడడానికి రాగులు ఉపయోగపడతాయి.

4. చిలగడదుంపలు : స్వీట్ పొటాటోలో ఫైబర్, Vitamin  , పొటాషియం అధికంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు మరియు అధిక పోషకాలు, అవి మీ పొట్టకు ఎంతో మేలు చేస్తాయి. చిలగడదుంపలు మలబద్ధకాన్ని నయం చేయడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.వీటిని ఉడకపెట్టుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి.

5. ఆకుకూరలు : ఆకుపచ్చని Vegitablesలలో మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకనే Winterలో రెగ్యులర్ గా తినే ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరలను తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆకులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. Winterలో సాధారణంగా ఎదుర్కొనే చర్మం , జుట్టు సమస్యలనుంచి ఆకుకూరలు మనల్ని కాపాడతాయి.


6. బాదం, అక్రోట్లు: Dry fruits , బాదంwalnuts  వంటివి రెగ్యులర్ తీసుకోవాలని doctor లు సూచిస్తున్నారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు చురుకైన నాడీ వ్యవస్థను, ఆరోగ్యకరమైన గుండెను ఇస్తుంది. అందుల్లనే Winterలో రోజు సాయంత్రం తినమని వైద్యులు సూచిస్తున్నారు. బాదం, వాల్ నట్ అయితే మన బడ్జెట్ లో వచ్చేస్తుంది. కాబట్టి అమ్మలు ఆరోగ్యం మీద అశ్రద్ద చేయకుండా ఈ Winte లోr మీమల్మి మీరు కాపాడుకోండి.


SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING

✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top