Wednesday, November 24, 2021

Justice Chandru Exclusive Interview in Telugu



పేరు: కె చంద్రు జస్టిస్ గా పని చేసింది కేవలం 6  సంవత్సరాల 7 నెలల్లో  96,000 వేకు పైగా కేసులు పరిష్కరించిన  ఏకైక  జస్టిస్ చంద్రు..... దాదాపు 16,000 వేలకు పైగా మానవ #హక్కుల ఉల్లంఘన కేసులకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పరిష్కరించిన గొప్ప వ్యక్తి కె చంద్రు.... ఇతనే గనక సుప్రీంకోర్టు జస్టీస్ అయితే కేవలం అంటే కేవలం 13 సంవత్సరాలలో కోర్టులో మగ్గుతున్న #చెత్తనంతా శుభ్రం చేసేవాడు.. కానీ వయస్సు కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది...



ఎవరీ జస్టిస్‌ చంద్రు?

జస్టిస్ చంద్రు...చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన తీర్పు ఎంతో మంది నిరుపేదల జీవితాను మార్చివేశాయి. ముఖ్యంగా అనగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. మానవహక్కుల కోసం డబ్బులు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. 2009లో ఆయన చెన్నై హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. సాధారణంగా ప్రతి న్యాయమూర్తి తన కెరీర్‌లో 10-20 వేల కేసులను మాత్రమే పరిశీలించి తీర్పులు ఇస్తారు. కానీ జస్టిస్‌ చంద్రు మాత్రం తన కెరీర్‌లో అత్యధికంగా 96 వేలకు పైగా తీర్పులు ఇచ్చి రికార్డు సృష్టించారు.

ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం, కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు వంటివి ఆయన ఇచ్చిన తీర్పుల్లో కీలకమైనవి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ.. హంగులు, ఆర్భాటాలకు మాత్రం దూరంగా ఉండేవాడు. తాను ప్రయాణించే కారుకు ఎర్రబుగ్గని తొలగించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అలాగే వ్యక్తిగత భద్రతను కూడా వదులుకున్నారు. 2013లో ఆయన రిటైర్డ్‌ అయ్యారు. వాస్తవానికి ఎవరైనా న్యాయమూర్తి రిటైర్ అయితే ఆయనకు ఓ స్టార్ హోటల్‌లో విందును ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ జస్టిస్ చంద్రు మాత్రం కోర్టు అవరణలోనే విడ్కోలు చెప్పి, ప్రభుత్వం ఇచ్చిన కారును అక్కడే వదిలేసి లోకల్‌ ట్రైన్‌లో ఇంటికి వెళ్లారు. అంత సింపుల్‌సిటీ చంద్రు సొంతం. లాయర్‌గా, న్యాయమూర్తిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో ‘లిజన్ టు మై కేస్’ అనే పుస్తకాన్ని రచించారు జస్టిస్‌ చంద్రు. ఆ పుస్తకంలోని ఓ కథతోనే ప్రస్తుతం జై భీమ్ సినిమా తెరకెక్కింది

Justice Chandru Exclusive Interview in Telugu | Surya Jai Bhim Movie Justice Chandru about Jai Bhim..


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top