Cyclone Alert: ఏపీకి తుఫాన్ ముప్పు..? ఈ జిల్లాలకు హై అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..
ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ప్రకృతి పగబట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే గత వారం రోజుల్లో నెల్లూరు, చిత్తూరు, కడప, జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాజాగా మారోసారి భారీ వర్షాల ముప్పు పొంచిఉంది.
మరో 24గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి 48గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించనుంది. ఇది మరింత బలపడి తుఫాన్ గానూ మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది
ఇదిలా ఉంటే శ్రీలంక తీరంవైపు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రాతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.
రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈనెల 28 నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, చిత్తూరు, జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముంది.
ఇక తీరం వెంబటి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండటంతో నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.