Monday, November 8, 2021

బడిలో బయోమెట్రిక్ హాజరు



•నేటి నుంచి జిల్లాలో  ప్రయోగాత్మకంగా అమలు 

•హాజరు నమోదుకు ప్రత్యేక యాప్  

•పారదర్శకత కోసం ప్రభుత్వం నిర్ణయం 

• క్షేత్రస్థాయి సమస్యలపై అధికారుల ప్రత్యేక దృష్టి

మచిలీపట్నం: విద్యార్థులకు మేలు చేయాలనే సంక ల్పంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పారద ర్శకతకు పెద్ద పీట వేసేలా ప్రభుత్వం దృష్టి సారిం చింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్ధులు అందరినీ బడిబాట పట్టించేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశాడు. జిల్లాలో ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి దీనిని అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని యాజ మాన్యాల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల హాజ రును బయోమెట్రిక్లో నమోదు చేయాలని స్పష్ట మైన ఆదేశాలు ఉంటాయి. దీంతో జిల్లాలోని పార శాలల ప్రధానోపాధ్యాయులను విద్యాశాఖ అధికా అప్రమత్తం చేశారు. ప్రత్యేక యాప్లో హాజరు నమోదు

• విద్యార్థులు హాజరు నమోదుకు ప్రత్యేక యాపిను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొబైల్ ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని, బయోమెట్రిక్ డివైస్కు అనుసంధానం చేస్తారు. చైల్డ్ ఇన్నో అనుసంధానమై ఉన్న యాప్ స్కూల్ యూడైన్ కోడ్ ద్వారా ఓపెన్ చేసి విద్యార్థుల హాజరు నమోదు చేయాలి.

• పాఠశాల మొదటి పీరియర్లోనే హాజరు నమోదు చేయాలి. పాఠశాల లొకేషన్ యాప్లో చూపిస్తుంది. బయోమెట్రిక్ హాజరుతో ఆ రోజు ఎంతమంది వాస్తవంగా బడికి వచ్చారనేది స్పష్ట మైన లెక్క తేలుతుంది. మధ్యాహ్న భోజనం పథకం అమలు కూడా ఇదే ప్రాతిపదికగా తీసుకుంటారు.

• స్కూళ్లకు గతంలో ఇచ్చిన ఐరిస్, పింగర్ ప్రింట్ యంత్రాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. అర్హులకే సంక్షేమ పథకాలు

* 2020-21 విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో గల 1435 పాఠశా లల్లో 623046 మంది విద్యార్థులు వారిలో 575 20 మందికి అమ్మాఒడ్ వర్తించే చేశారు 1.31.244 మంది విద్యార్థులకు వారి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి

జిల్లాలోని పాఠశాలలన్నింటిలో బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి, సాంకేతి కపరమైన సమస్యల పరి ష్కారం కోసం ఉన్నతాధికా రులకు నివేదించాం. మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నందున విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. మండల విద్యాశాఖాధి కారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి. - తాహెరా సుల్తానా, డీఈఓ

75 శాతం హాజరు తప్పనిసరి

2021-22 విద్యా సంవత్సరంలో చైల్డ్ ఇన్ఫోలో 6,08,339 మంది విద్యార్థులు లెక్క తేలారు. dropbox  ఉన్న విద్యార్థుల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది 

* ఒక విద్యార్ధి ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశా లకు మారిన నేపథ్యంలో రెండు చోట్లా అమ్మ ఓడి జాబితాలో పేరు నమోదు చేయడంతో ఒక చోట అమ్మ ఒడి లబ్దిచేకూరింది. ఉద్యోగుల పిల్ల లకు కూడా అమ్మ ఒడి వర్తింపజేసినట్లు ఆదా లతో సైతం ఉన్నతాధికారులు జాబితాను విడుదల చేశారు.

• సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరు వర్తిం పజేస్తున్నారు. 2022 ఏప్రిల్ 30 నాటికీ ముగియనున్న ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 130 ఈ రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఇందులో 98 రోజులు (75 కాతం) కచ్చితంగా బడికి రావాలి. 


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top