➤ శాసనమండలి రద్దుపై జగన్ సర్కార్ అడుగులు!
➤ రద్దు తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయం
➤ కొత్తగా మరో తీర్మానం చేసేందుకు కసరత్తు?
జగన్ సర్కార్ మరో అనూహ్యం నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో కొత్త తీర్మానాన్ని తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఉపసంహరణ తీర్మానం కాపీని కేంద్రానికి పంపేందుకు సిద్ధమవుతున్నారట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాావాల్సి ఉంది.
గతేడాది జనవరిలో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులను శాసనమండలి వ్యతిరేకించింది. అయితే 151 స్థానాలున్న అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని, ప్రజాబలంతో గెలిచిన శాసనసభ నిర్ణయాన్ని టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలి వ్యతిరేకించిందని సీఎం జగన్ ఆగ్రహించారు. మండలి నిర్వహణకు రోజూ రూ.లక్షల్లో భారం మోయాల్సి వస్తోందని.. అసలీ వ్యవస్థే వద్దని.. రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27న శాసనసభలో తీర్మానం పెట్టారు.. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు.
గతేడాది నుంచి శానసమండలి రద్దు వ్యవహారం పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం శాసనమండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఆధిక్యం వచ్చింది. అందుకే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందనే చర్చ జరుగుతోంది. అయితే మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్న ప్రభుత్వం మళ్లీ శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.