Monday, November 1, 2021

ఎయిడెడ్ పాఠశాలలను మేమే నడుపుతాం➤ ఎయిడెడ్ పాఠశాలలను మేమే నడుపుతాం

➤ గుంటూరులో సమావేశమై తీర్మానం చేసిన కరస్పాండెంట్లు

ఈనాడు, అమరావతి: 'ఎయిడెడ్ పాఠశాలలు స్వాతంత్య్రానికి ముందునుంచే ఉన్నాయి. తొలినా ళ్లలో వీటి ద్వారానే చాలామందికి విద్య అందింది. ఇలాంటి వ్యవస్థలను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోంది' అని ఎయిడెడ్ విద్యాసంస్థల కర స్పాండెంట్లు ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వం దీనికి స్వస్తి పలకాలని, జీఓ నంబరు 50ను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆది వారం గుంటూరులో పలు జిల్లాల ఎయిడెడ్ విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్లు సమావే శమై ప్రస్తుత పరిణామాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ యాజమాన్యాల సంఘం (ప్రాసా) రాష్ట్ర నాయకుడు మైలా అంజయ్య మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణకు గ్రాంట్లు, పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వకుండా ప్రభు త్వాలే ఎయిడెడ్ విద్యాలయాలను నిర్వీర్థ్యం చేస్తూ వస్తున్నాయని ధ్వజమెత్తారు. 

తనిఖీ కమిటీలు  పాఠశాలల పరిశీలనకు వెళ్లినప్పుడు పిల్లలు లేరనే సాకుతో ఉన్న ఉపాధ్యాయులను ప్రభుత్వా నికి సరెండర్ చేయాలని కోరటం, తమకు గ్రాంటు ఇన్ ఎయిడ్ వద్దని లేఖలు ఇవ్వాలనడం సమంజసం కాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి బల వంతపు చర్యలు ఆపితే చాలామంది తిరిగి తమ విద్యాలయాలను నడుపుకోవటానికి ఆసక్తిగా ఉన్నారని, బోదించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంఈవోలను పంపి టీచర్లతో బలవంతంగా ప్రభుత్వ పరిధిలోకి వస్తా మని సంతకాలు తీసుకున్నారని, కరస్పాండెంట్ల పైనా ఇదే ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లను ప్రభుత్వానికి ఇచ్చేది. లేదని, సిబ్బంది సహా తామే వాటిని నడుపుతా మని, నిర్వహణ గ్రాంట్లు, పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఏకగవంగా తీర్మానాలు: చేశారు. కార్యక్రమంలో ప్రాస్కా నాయకులు నారా యణరెడ్డి, దాసరి రామకృష్ణ, శామ్యూల్ మోజెస్, డీవీఎస్ సుబ్బారావు పాల్గొన్నారు.


SEARCH THIS SITE

LATEST UPDATES

TRENDING

✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top