Apple iPhone 13: డైనోసార్‌ పళ్లతో ఫోన్‌ డిజైన్‌, కొనేందుకు ఎగబడుతున్న బిలియనీర్లు..!

 Apple iPhone 13: డైనోసార్‌ పళ్లతో ఫోన్‌ డిజైన్‌, కొనేందుకు ఎగబడుతున్న బిలియనీర్లు..!

రూ.లక్ష,లేదంటే లక్షన్నర ఉంటుంది. కానీ ఈ ఫోన్‌ ధర అక్షరాల రూ. 6.83 లక్షలు. ఎందుకంత కాస్ట్‌ ఉంటుందని అనుకుంటున్నారా?  మీరు ఊహించినట్లు ఫోన్‌ని వజ్రాలు, వైడుర్యాలతో డిజైన్‌ చేయలేదు. అది కేవలం ఫోన్‌ మాత్రమే. కానీ దానికో స్పెషాలిటీ ఉంది. అందుకే అంత కాస్ట్‌ ఉంది. 

ఐఫోన్‌ 13 సిరీస్‌

ఇటీవల టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 13 సిరీస్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్‌ 13ప్రో ఫోన్‌ ధర రూ.119,900, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ధర రూ.129,900 ఉండగా..ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఐఫోన్‌ 13సిరీస్‌ ఫోన్‌ల ధరలు రూ. 6.4లక్షలు, రూ.6.8లక్షలుగా ఉంది. అందుకు కారణం ఆ ఐఫోన్‌ ప్యానలే. వరల్డ్‌ వైడ్‌గా ఐఫోన్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లకు కేవియర్‌ అనే సంస్థ లగ్జరీ కేసెస్‌ను తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేస్తుంది. తాజాగా అదే కేవియర్‌ సంస్థ నిజమైన డైనోసార్‌ పళ్లతో ఐఫోన్‌ కెసెస్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ఆ ఫోన్‌ నెట్టింట్లో సందడి చేస్తుండగా.. ఆ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు బిలియనీర్లు ఎగబడుతున్నారు.

80 మిలియన్‌ సంవత్సరాల క్రితం 


కేవియర్‌ సంస్థ 80 మిలియన్‌ సంవత్సరాల క్రితానికి చెందిన డైనోసార్ల పళ్లతో ప్రత్యేకంగా ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13ప్రో మ్యాక్స్‌ ఫోన్‌ కేసెస్‌లను డిజైన్‌ చేసింది. ‘Tyrannosaurus rex(T. rex)’ అనే పేరుతో ఆఫోన్‌ కేసెస్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. 1 టెరా బైట్‌ స్టోరేజ్‌ ఉన్న ఐఫోన్‌ 13ప్రో ధర రూ. 6.8 లక్షలుగా ఉండగా ఈ ఫోన్‌ల గురించి కేవియర్‌ ప్రతినిధుల పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ ఐఫోన్‌ కేసెస్‌ను డిజైన్‌ చేసిన డైనోసార్‌ పళ్లు 80 మిలియన్ సంవత్సరాలని తెలిపారు. డైనోసార్లలో అత్యంత బలమైన జాతి టైరన్నోసారస్‌. టైరన్నోసారస్‌ జాతికి చెందిన డైనోసార్లు మనుషుల కంటే 125 రెట్ల శక్తివంతమైందని తెలిపారు. 4 మీటర్ల ఎత్తు,12.3 మీటర్ల పొడవు వరకు ఉండే ఈ డైనోసార్లలో అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకటిగా అభివర్ణించారు. కాబట్టే  వినియోగదారుల్ని ఆకర్షించేందుకు డైనోసార్‌ పళ్లతో ఫోన్‌ కేసెస్‌ను తయారు చేసినట్లు చెప్పారు. 

Flash...   ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇవ్వనున్న ఉద్యోగులు..!

ఫోన్‌ లో డైనోసార్‌ పళ్లు 

టీ రెక్స్ (T. rex) అని పిలిచే ఫోన్‌ వెనుక ప్యానల్‌లో కేవియర్‌ సంస్థ నిజమైన డైనోసార్‌ పళ్లను ఇమిడ్చింది. ఆ ఫోన్‌ ప్యానల్‌ను నలుపు, పీవీడీ(Physical vapor deposition) పూతతో, టైటానియంతో తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫోన్‌ ప్యానల్‌లో ఉండే డైనోసార్‌ పళ్లను ఎక్కడ సేకరించారనే విషయాన్ని కేవియర్‌ సంస్థ వెల్లడించలేదు