Monday, November 29, 2021

వణుకు పుట్టిస్తున్న 2022 బ్రహ్మం గారి కాలజ్ఞానం. వణుకు పుట్టిస్తున్న 2022 బ్రహ్మం గారి కాలజ్ఞానం.


పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి తన కాలజ్ఞానాన్ని రచించారు. స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని విషయాలు చాలా వరకు నిజంగానే జరిగాయి. అయితే క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో వీరబ్రహ్మంగారు అవతరించి, భవిష్యత్తులో జరగబోయే విపత్తులను, ఆయన ముందుగానే దర్శించి దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు.

వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు కూడా. మరి ఇప్పటికి బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే విషయాలు, మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో, బ్రహ్మం గారు పరబ్రహ్మణి చేరుకునేందుకు, ధ్యానం ఒక మార్గం అని చెప్పి, ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్లిపోయిన బ్రహ్మంగారు, ఒక రోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్ర ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నువ్వు అని అడగగా, బ్రతుకు తెరువు కోసం వచ్చాను అని చెప్పాడు.

ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడగగా, అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులను తోలుకు వెళ్ళమని చెప్పగా, బ్రహ్మం గారు గోవుల కాపరి గా మారాడు. గోవుల కాపరి గా మారిన తర్వాత కాలజ్ఞానాన్ని మొదలు పెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండ భూమిలో రాయటం మొదలుపెట్టాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియచెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోటే పాతి పెట్టారు. ఆ తర్వాత దాని పైన చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు అనేదానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి అప్పట్లోనే వివరణ 

బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే? కాశీలోని దేవాలయం నలబై రోజులు పాడు పడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది, పన్నెండు మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివలన ఆ సమయంలో కాశి పుణ్యక్షేత్రం సందర్శించెందుకు భక్తులు ఎవరు వెళ్ళలేదు. ఇక తర్వాత రెండో విషయం ఏంటంటే, రాజరికాలు, రాజుల పాలన నశిస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు.

ఇక ఇందిరా గాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణులకు అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటివరకు తెలీదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాల్లో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొన్న లేకపోతారు అని అన్నారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం. మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుక్కోలేదు.

రావణకాష్టం, కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పట్టను రావణుని దేశం అంటే శ్రీలంకను శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు అని చెప్పాడు. ప్రస్తుతం నీటి నుండే విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ సిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. గట్టి వాడైన పొట్టి వాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని అన్నారు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టి వాడైనా లాల్ బహదూర్ శాస్త్రి సమర్ధవంతమైన పాలనను అందించారని చెప్పుకోవచ్చు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు అని అన్నారు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాలను ప్రవర్తిస్తారు అన్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారి తీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పాడు బ్రహ్మం గారు. ఆయన చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారత దేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటె ఇప్పటివరకు జరగనివి రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమని ఉందంటే కృష్ణా నది కనకదుర్గమ్మ వారి ముక్కు పడుకొని అంటుకుంటుంది అని. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డాం బీటలు పడి అలాంటి విపత్తు జరిగితే కృష్ణా నది ఇంద్రకీలాద్రి ని తాకే ప్రమాదం ఉంది అని చెప్పాడు

వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది అని దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి అని చెప్పి అన్నారు. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి. ఇంకా కృష్ణా నది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి, ఆ కాంతి వల్ల కన్నులు కనపడకుండా గుడ్డి వారు అవుతారని కూడా ఉంది. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది ఎనిమిది రోజులు ఉండి బ్రమరాంబ గుడిలో దూకి మేకపోతు వల్లే అరిచి మాయమైపోతుంది అని చెప్పాడు. కలియుగానా ఐదు వేల సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగుళూరు కామక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి, రాళ్లు దొర్లి పడి జన నష్టం జరుగుతుంది.

పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయి అని చెప్పారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మ రహస్యం గురించి మనం తెలుసుకున్నట్లు అయితే, ఐదు వేల ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయలు అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తారు. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో, సాలకి గ్రహములు నాట్య మాడుతాయి, మనుషులతో మాట్లాడతాయి అని చెప్పారు. ఇలా భవిష్యత్తు ని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగినాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతూనే ఉంటాయి.

కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైస్సార్ కడప జిల్లా మైదుకూరుకు సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కందిమల్లయ్యపల్లి అనే గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పేరుగాంచిన పురాతనమైన మఠం. అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని, విష్ణువు యొక్క అవతారంగా కొందరు భక్తులు కొలుస్తారు. ఇక క్రీస్తు శకం పదహారు వందల తొంబై నాలుగవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారు భక్తుల సమక్షంలో జీవసమాధి యందు ప్రవేశించారు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు దీక్ష వహించి బ్రహ్మంగారిమఠం మనకు వచ్చి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవ సమాధిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు.

For More information visit this linkSEARCH THIS SITE

LATEST UPDATES

✺ SSC MODEL PAPERS 2022

TRENDING

✺ SSC MODEL PAPERS 2022✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top