Saturday, October 30, 2021

ఇలా చెక్ చేస్తే షుగర్ వ్యాధి గురించి కచ్చితంగా తెలుస్తుందట..మనం ఆహారం తిన్నప్పుడు.. పిండిపదార్థాలను మన శరీరం ముక్కలుగా చేసి షుగర్‌గా మారుస్తుంది. దానిని గ్లూకోజ్‌గా వ్యవహరిస్తారు. క్లోమం(పాంక్రియాస్)లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్.. ఆ షుగర్‌ని శక్తి కోసం లీనం చేసుకోవాలని మన శరీర కణాలకు నిర్దేశిస్తుంది

sugar-test

చాలా సాధారణ లక్షణాలు:

➤ అధికంగా దాహంగా అనిపిస్తూ ఉండటం

➤ మామూలు కన్నా ఎక్కువగా.. ప్రత్యేకించి రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జన చేయటం

➤ చాలా అలసిపోయినట్లు అనిపించటం

➤ ప్రయత్నించకుండానే బరువు తగ్గిపోవటం

➤ నోట్లో తరచుగా పుండ్లు అవుతుండటం

➤ చూపు అస్పష్టంగా మారటం

➤ శరీరం మీద గాయాలు, దెబ్బలు మానకపోవటం

షుగర్‌ని కంట్రోల్ చేసే టిప్స్..

క్తంలో షుగర్ స్థాయి అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం టైప్ 2 డయాబెటిస్‌తో ఉన్నవారికి ప్రమాదకరం. ఏదైనా ఊహించని సంఘటనలను నివారించడానికి వారి రక్తంలో షుగర్ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం వారికి చాలా ముఖ్యమైనది. చాలా మందికి రక్తంలో షుగర్ స్థాయిలు పెరగడంపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. షుగర్‌లో తగ్గుదల ఆరోగ్యానికి హానికరం అనే వాస్తవం తెలియదు. తక్కువ రక్తంలో షుగర్ స్థాయిలు లేదా హైపోగ్లైసీమియా అనేది మీ గ్లూకోజ్ స్థాయి 70 mg/dL (డెసిలీటర్‌కు మిల్లీగ్రాములు) లేదా అంతకంటే తక్కువకు పడిపోయే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది వణుకు మరియు కళ్ళు తిరగడం వంటి లక్షణాలకి దారి తీస్తుంది మరియు తీవ్రమైన అనారోగ్యంగా అనిపిస్తుంది. సమయానికి నిర్వహించబడకపోతే, పరిస్థితి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు లేదా ఒక వ్యక్తిని కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

హైపోగ్లైసీమియాకు కారణాలు

మనం తినే ఆహారాలు, మనం చేసే కార్యకలాపాలను బట్టి మన రక్తంలో షుగర్ స్థాయి ప్రతిరోజు మారుతూ ఉంటుంది. రక్తంలో షుగర్ సాధారణ స్థాయి కంటే తగ్గినప్పుడు దానిని హైపోగ్లైసీమియా అంటారు. హైపోగ్లైసీమియా యొక్క అత్యంత సాధారణ కారణం, అధికంగా ఇన్సులిన్ మందులు తీసుకోవడం లేదా తక్కువ కార్బోహైడ్రేట్ వినియోగం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి రెండు కారణాలు, రక్తంలో షుగర్ స్థాయి ప్రమాదకర స్థాయికి పడిపోవడానికి దారితీస్తాయి, ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.

లక్షణాలు

మీ రక్తంలో షుగర్ స్థాయి పడిపోయినప్పుడు, అది కొన్ని స్పష్టమైన లక్షణాలకు దారితీస్తుంది. లక్షణాలు నెమ్మదిగా కనిపించడం ప్రారంభిస్తాయి, దీని వెనుక కారణాన్ని గుర్తించడం కొంచెం కష్టమవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు:

➤వణుకు

➤నీరసం

➤చెమటలు లేదా చలి

➤చిరాకు

➤కన్ఫ్యూషన్

➤గుండె గట్టిగా కొట్టుకోవడం


హైపోగ్లైసీమియాకు చికిత్స..

ఒకసారి మీరు హైపోగ్లైసీమియా యొక్క లక్షణాలను గుర్తించగలిగితే, చాలా సందర్భాలలో మీరు దానిని మీ సొంతంగా సులభంగా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ హైపోగ్లైసీమియా యొక్క ఎపిసోడ్‌ను అధిగమించడానికి “15-15 నియమాన్ని” చెబుతోంది.

15 గ్రాముల పిండి పదార్థాలు..

రక్తంలో షుగర్ స్థాయిలను పెంచడానికి 15 గ్రాముల వేగంగా పనిచేసే పిండి పదార్థాలు తినడం మంచిది. ఇవి ప్రోటీన్ లేదా కొవ్వు లేని చక్కెర ఆహారాలు కాబట్టి వెంటనే శరీరంలో షుగర్‌గా మార్చబడతాయి. కూల్ డ్రింక్స్, తేనె మరియు స్వీట్స్ లాంటివి తినడం తక్షణ ఫలితాన్ని ఇస్తాయి.

రక్తంలో షుగర్ స్థాయిలు చెక్..

పిండి పదార్థాలు తీసుకున్న 15 నిమిషాల తర్వాత మీ రక్తంలో షుగర్ స్థాయిని చెక్ చేయండి. ఇది ఇప్పటికీ 70 mg/dL (3.9 mmol/L) కంటే తక్కువగా ఉంటే, మరొక 15 గ్రాముల ఫాస్ట్ యాక్టింగ్ కార్బోహైడ్రేట్ తినండి లేదా త్రాగండి మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మళ్లీ చెక్ చేయండి.

డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి..

15-15 నియమాల యొక్క మూడు ప్రయత్నాల తర్వాత మీ రక్తంలో షుగర్ స్థాయి బ్యాలన్స్ కానట్లయితే లేదా లక్షణాలు అధ్వాన్నంగా ఉంటే, ఆలస్యం చేయకుండా మీ ఫామిలీ డాక్టర్‌ని కలవండి. హెల్త్‌కేర్ ప్రొవైడర్లు గ్లూకాగాన్ అనే మందులను ఉపయోగించవచ్చు లేదా ఇంట్లోనే శరీరంలో షుగర్ స్థాయిని పెంచడానికి ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. హైపోగ్లైసీమియా ఎపిసోడ్‌లను నివారించడానికి ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తీసుకోండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు మీ మందులను సమయానికి తీసుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

EDUCATIONAL UPDATES

TRENDING

AMMA VODI 2022  
✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

Mid Day Meal

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top