Vaccine Originality: కరోనా వ్యాక్సిన్ అసలైనదా, నకిలీదా అనేది ఎలా గుర్తించడం
Vaccine Originality: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. అదే సమయంలో నకిలీ వ్యాక్సిన్ల బెడద ఆందోళన కల్గిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పున్న నేపధ్యంలో..ఆ వ్యాక్సిన్లను ఎలా గుర్తించాలనేది చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ నకిలీదా లేదా అసలా అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కోవిషీల్డ్ : (Covishield)విషయంలో లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ఇదే రంగులో ఉంటుంది. ట్రేడ్‌మార్క్‌తో సహా కోవిషీల్డ్ బ్రాండ్‌నేమ్ స్పష్టంగా కన్పిస్తుంది. జనరిక్ పేరు బోల్డ్ అక్షరాల్లో కన్పిస్తుంటుంది. సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాల్సి ఉంటుంది. వయల్‌పై లేబుల్ ఉన్న చోట ఎస్ఐఐ లోగో నిట్ట నిలువగా కాకుండా కాస్త వంపుతో ఉంటుంది. ఇక లేబుల్‌పై కొన్ని అక్షరాల్ని తెల్లసిరాతో ముద్రించారు. మొత్తం లేబుల్‌పై తెనెపట్టు లాంటి చిత్రం ఓ ప్రత్యేకమైన కోణంలో చూస్తే కన్పిస్తుంది.
కోవాగ్జిన్‌ను : (Covaxin)ఎలా గుర్తించాలో కూడా కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం వంటి చిత్రం అతి నీలలోహిత కాంతిలో స్పష్టంగా కన్పిస్తుంది. లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా గమనించవచ్చు.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.