Wednesday, September 8, 2021

Movie Tickets: సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం AP లో ప్రభుత్వ పోర్టల్‌


WHATSAPP GROUP TELEGRAM GROUP


సినిమా  టికెట్ల బుకింగ్‌ కోసం ఏపీలో ప్రభుత్వ పోర్టల్‌


హైదరాబాద్‌: ఒకప్పుడు సినిమా చూడాలంటే టికెట్‌ కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. అదే అగ్ర కథానాయకుడి సినిమా అయితే, తెల్లవారుజాము నుంచే థియేటర్‌ వద్ద పడిగాపులు కాసేవారు. టికెట్ల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌/యాప్‌లు వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి ఉపశమనం లభించింది. కాగా, సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.

‘‘సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది’’ అని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది. మరోవైపు తెలంగాణ కూడా ఇదే బాటలో పయనిస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది.

కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిబంధనల మేరకు చిత్రీకరణలు జరుగుతున్నా, పెద్ద సినిమాలు థియేటర్‌లో విడుదలయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. తెలంగాణ థియేటర్స్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా, ఏపీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో నిర్మాతలు, థియేటర్స్‌ యజమానులు, పంపిణీదారులు ఏదో రూపంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top