నిద్ర లో పక్షులు పట్టు జారిపోవు ఎందుకని? Why Birds Do Not Fall From Trees While Sleeping

ప్రశ్న: చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్ర పోగలుగుతాయి?


జవాబు: అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి ఏమాత్రం కిందపడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. 


పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. 

పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయిగానీ కిందపడిపోవు.

Why Birds Do Not Fall From Trees While Sleeping


Birds grab hold of a tree branch by curling their talons around it. The question is how do hey manage to keep holding on to that branch even while sleeping? If you went to sleep holding on to something, at some point your muscles would relax and you let go of what was in your hand. How is it that birds don’t relax their feet while sleeping and let go of the branch?  

Flash...   పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

The answer is that birds grasp branches using their talons, and the reason that they don’t fall off while asleep is that it is an involuntary reflex. When they perch on a branch, that is when the land on the branch and they bend their legs to sit on it, their talons automatically

clasp it and lock on to it. Their feet let go of the branch, unlock the talons only when their legs straighten. So long as the bird is sitting, it will stay locked on to the branch. In other words, even if the bird wants to, it cannot let go of the branch so long as its legs (ankles) are bent.  

Read More: