Sunday, August 22, 2021

Traffic Challan: పెండింగ్ చలానాలు ఉన్న వాహనం సీజ్ చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు ఉందా..?


WHATSAPP GROUP TELEGRAM GROUP


 


మీ వెహికల్ మీద పెండింగ్ చలానాలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ తెలుసుకొండి 

ఈ లింక్ ని ఓపెన్ చేసి వెహికల్ నెంబర్ తో చెక్ చేసుకోగలరు : https://apechallan.org/

చలానాలు ఉంటే పోలీసులు బండి సీజ్‌ చేయొచ్చు.. 

మోటారు వాహన నిబంధనల్లోని 167వ రూల్‌ ఇదే చెబుతోంది 

స్పష్టం చేసిన సైబరాబాద్‌ పోలీసులు

హైకోర్టు ఉత్తర్వుల పేరుతో పోస్టులు వైరల్‌

అవి తప్పుడు పోస్టులు అని పోలీసుల వెల్లడి

న్యాయవాదిపై చర్యలకు పోలీసులు సిద్ధం!

వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేయొచ్చు

స్పష్టం చేసిన సైబరాబాద్‌ పోలీసులు.. 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): నిబంధనలను ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్‌ చేసే అధికారం తమకు ఉంటుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. కేంద్రా మోటారు వాహన నిబంధనల్లోని 167వ రూల్‌ ఇదే చెబుతోందని వివరించారు. వాహనంపై చలానాలు 90 రోజులకు మించి పెండింగ్‌లో ఉంటే.. వాటిపై వాహనదారుడు స్పందించకుంటే.. అలాంటి వాహనాలను సీజ్‌ చేయవచ్చని వెల్లడించారు. వాహనదారులు ఎప్పటికప్పుడు తమ చలానాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆర్టీఏ, రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్లలో మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేస్తే.. చలానాలు జనరేట్‌ అయినప్పుడు వారి ఫోన్‌కు సందేశాలు వస్తాయని చెప్పారు. తప్పుడు చలానాలు ఉంటే.. దానిపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందని, వెంటనే అలాంటి వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ‘చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్‌ చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదు’ అని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు స్పందించారు.

ఆదివారం ఆ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ హైకోర్టు అలాంటి ఆదేశాలను ఇవ్వలేదని తెలిపారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని వివరించారు. ‘‘ఓ న్యాయవాది తన వాహనాల చలానాలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. సీజ్‌ చేసిన సదరు అడ్వొకేట్‌ వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ రెండు వారాల్లో పోలీసులకు లేఖ రాయాలని కోర్టు సూచించింది. పోలీసులు దాన్ని పరిశీలించి, 8 వారాల్లోపు వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది’’ అని తెలిపారు. నిజానికి సదరు అడ్వొకేట్‌ ఈ నెల 19న రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసుల ముందు హాజరై.. పెండింగ్‌ చలానాలను చెల్లించి, వాహనాన్ని విడిపించుకున్నారని చెప్పారు. పిటిషనర్‌ ఈ వాస్తవాన్ని దాచి, హైకోర్టు ఉత్తర్వులను వక్రీకరించి చూపడంలో ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అన్నారు. కాగా, తప్పుడు వార్తలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన సదరు న్యాయవాదిపై పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

నా ప్రమేయం లేకుండా జరిగింది: న్యాయవాది

పోలీసులకు వాహనాలను జప్తు చేసే అధికారం లేదని, ఆ మేరకు హైకోర్టు ఉత్తర్వులిచ్చిందంటూ వైరల్‌ అయిన పోస్టులపై నిఖిలేశ్‌ అనే న్యాయవాది వివరణ ఇచ్చారు. ఈ మేరకు లీగల్‌ మీడియా ప్రతినిధుల వాట్సాప్‌ గ్రూపుల్లో ఓ ప్రకటన షేర్‌ అయ్యింది. ‘‘నేను హైకోర్టును ఆశ్రయించిన విషయం వాస్తవమే. 11న హైకోర్టు ఆ పిటిషన్‌ను డిస్పోస్‌ చేసింది. కాంటెస్ట్‌ చేయడం ఇష్టం లేక.. నేను 19వ తేదీన చలానాలు చెల్లించి, నా వాహనాన్ని విడిపించుకున్నాను. సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులకు నేను బాధ్యుడిని కాదు. అందులో నా ప్రమేయం లేదు. న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు’’అని నిఖిలేశ్‌ స్పష్టం చేశారు.

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top