Tuesday, August 31, 2021

తానె కొట్టి సస్పెండ్ చేసి ! ... నిరసన చేసారని ఏపీ SSC బోర్డు ఉద్యోగుల సస్పెండ్...


WHATSAPP GROUP TELEGRAM GROUP


తానె కొట్టి సస్పెండ్ చేసి !

» ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ వింత వైఖరి

» దెబ్బలు తిన్న సూపరింటెండెంట్ ఎల్లాలుపై వేటు 

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఎస్ఎస్సీ బోర్డులో గొడవలు మరింత ముదిరాయి. ఉద్యోగులను దుర్భాషలాడి, కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు డైరెక్టరే... బాధి తుడైన సూపరింటెండెంట్ ఎల్లాలుతోపాటు డిప్యూటీ కమిష నర్ శ్రీనివాస్, మరో సూపరింటెండెంట్ చంద్రబోస్లను సస్పెండ్ చేశారు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రేపటిలోగా సస్పెన్ ఉత్తర్వులు రద్దు చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇందుకు డైరె క్టర్ సుబ్బారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏపీఎన్ జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎస్ఎ ససీ బోర్డులో గత గురువారం, శుక్రవారం డైరెక్టర్ సుబ్బారెడ్డి బోర్డు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఎస్ఎస్సి బోరు నుంచి కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని డిప్యుటేషన్పై సర్వ శిక్ష ఆబియానక్కు పంపించాలన్న ప్రతిపాదనపై ఈ గొడవ రేగింది. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో సుబ్బారెడ్డి తనను కొట్టారని ఎలాలు పేర్కొన్నారు. అయితే తానెవరిని కొట్టలేదని సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు ఆదేరోజు భవానీపురం పోలీస్ స్టేషన్లో సుబ్బారెడ్డిపై కేసు పెట్టారు. ఆతర్వాత శని, ఆది, సోమవారం సెలవులు వచ్చాయి. మంగళవారం మళ్లీ ఉద్యోగులు ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి పోలీసులకు సమాచారం అందించారని తెలిసింది. దీంతో ఎస్ఎస్సీ బోరు వదకు నలుగురు పోలీ సులు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈలోగా ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారన్న విషయం. సిబ్బందికి తెలిసింది. కాగా, ఎస్ఎస్సి బోర్డులో జరుగుతున్న గొడవలపై సూపరింటెండెంట్ సుజాత మాట్లాడుతూ డైరె క్టర్ సుబ్బారెడ్డిది మొదట్లో ప్రెండ్లి నేచర్ అనుకున్నాం కానీ మహిళలను ఆయన హింస పెడతారు. నన్ను వారంలో మూడు సెక్షన్లు మార్చారు నా ఆర్మాభిమానం దెబ్బతీశారు. మహిళా ఉద్యోగులు రాత్రి 9 గంటల వరకూ పనిచేయాలి. చట్టం అంటున్నారు ఈ ఆఫీసులో మహిళా ఉద్యోగులను ఆ చట్టం ఎలా కాపాడుతుంది' అని ప్రశ్నించారు.

డైరెక్టర్ పై   ఏపీఎన్ఎవో నేతల ఆగ్రహం

ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన విషయం తెలుసుకున్న ఏపీ NGO అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మంగళవారం SSC  బోర్డు కార్యాలయానికి వచ్చారు. సుబ్బారెడ్డి ఉద్యోగు లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు గోడు చెప్పుకునేందుకు తమ వద్దకు వచ్చారని.. వారిని సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. రేప టికల్లా సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని.. లేకుంటే జరిగే పరిణామాలకు సుబ్బారెడ్డి బాధ్యత వహిం చాల్సి వస్తుందని హెచ్చరించారు.

సుబ్బారెడ్డిని బదిలీ చేయాలి: ఏపీ ఎన్డీవో సంఘం

ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడు సుబ్బారెడ్డిని బదిలీ చేయాలని ఏపీ ఎన్టీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండు చేశారు. ఉద్యోగులకు మద్ద తుగా ఎస్సెస్సీ బోర్డు కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగలపై వేధింపులను ఆపాలని, ఉద్యోగుల సస్పెన్షనన్ను వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం బుదవారం లోగా నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.  ఎస్ఎస్సీ బోర్డు సంచాలకులు ఎ. సుబ్బారెడ్డి వేధిస్తున్నట్లుగా ఉద్యోగుల సంఘం కోశాధికారి యల్లెలు భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల సమస్యలను తెలియజేసేందుకు ఆయన ఛాంబ ర్కు వెళ్లగా దురుసుగా ప్రవర్తించినట్లుగా ఫిర్యా దులో పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగులు తనపై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లుగా సంచాలకులు సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై భవానీపురం స్టేషన్ సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇరువర్గాల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ బోర్డులోని ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం సంచలనంగా మారింది.గొల్లపూడి లోని ఎస్సెస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సామ్స్) లో క్రమశిక్షణ, విధుల్లో అశ్రద్ద, స్ట్రైక్ లో పాల్గోన్నారని పేర్కోంటూ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు

 గొల్లపూడి ఎస్సెస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సామ్స్) ఆఫీసులో ఈనెల 27న ఉద్యోగుల నిరసనకు దిగారు.

బోర్డు డైరెక్టర్ తమ తోటి ఉద్యోగిపై చేయిచేసుకున్నారని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. మహిళలను దుర్భాషలు ఆడుతున్నారని, అధనపు పనిగంటలు పనిచేయాలని నిత్యం వత్తిడి తెస్తున్నారని అప్పట్లో మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డైరెక్టర్ కు, కమీషనర్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేసారు.

నిరసన తెలిపిన ఉద్యోగుల్లో కొందరిపై నేడు క్రమశిక్షణపేరుతో ఈ నెల 27నే సస్పెన్షన్ వేటు వేసారు. తనపై దాడిచేశారని పోలీసులకు కంప్లైంట్ చేసిన సూపరెండెంట్ చొక్కం ఎల్లాలుతో పాటు మరో ఇద్దరిపైనా సస్పెషన్ అస్త్రం ప్రయోగించారు. డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు, సూపరెండెంట్ పి చంద్రభూషన్ రావు ల పైనా సస్పెన్షన్ వేటు వేస్తూ నోటీసులు జారీ చేసారు.

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top