Thursday, August 26, 2021

Pyramids


WHATSAPP GROUP TELEGRAM GROUP


 History of Egypt: ఈజిప్టు చరిత్ర 

ఈజిప్టు పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు అద్దంపట్టే అత్యంత ప్రాముఖ్యత గల నిర్మాణాలు. సుమారు 850 సంవత్సరాలపాటు 138 పిరమిడ్లను వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాలలో నిర్మించారు.  మరి భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో పిరమిడ్లను ఎలా నిర్మించి ఉంటారు?

ఈజిప్ట్ లో భిన్న సంస్కృతికి కొన్ని వేల ఏళ్ల కిందే నెలకొంది. స్ఫింక్స్ , పిరమిడ్స్ , వాలీ ఆఫ్ కింగ్స్ లోని సమాధులు, లుక్సర్ ఇంకా కార్నాక్ లో ఉన్న దేవాలయాలు, పురాతన ఈజిప్ట్ సంస్కృతికి నిదర్శనాలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు పూర్వం ఈజిప్ట్ లో ఫెరోల సామ్రాజ్య స్థాపన ప్రారంభమైంది. వీరు మరణానంతరం కూడా జీవితంపై ఉన్న నమ్మకంతో సమాధుల పేర్లతో పిరమిడ్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలో అతి పొడవైన నైల్ నది వల్లే ఈజిప్ట్ కు అంత ప్రాచుర్యం ఏర్పడింది.

క్కడ క్రీస్తుపూర్వం 3300 నుంచి 2686 వరకు జరిగిన కాలాన్ని మొట్టమొదటి రాజుల కాలంగా పరిగణిస్తారు. క్రీస్తు పూర్వం 2686 నుంచి 2181 వరకు ఫెరోలు పరిపాలించారు. క్రీస్తుపూర్వం 2181 నుంచి 1550 సంవత్సరం వరకు పాత రాజవంశ పతనానికి కొత్తరాజవంశ అవతరణకు మధ్య ఒక 130 సంవత్సరాలు ఈజిప్ట్ రాజవంశ చరిత్రలో అల్లకల్లోలం ఏర్పడింది. ఇక ఇక్కడ కొత్త రాజవంశంక్రీస్తుపూర్వం 1550 నుంచి 1069 సంవత్సరం వరకు కొనసాగింది. 19 సంవత్సరాలకే అనుమాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ఫెరో టుటన్‌కామూన్ చరిత్ర ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. 

పిరమిడ్ల నిర్మాణం ఎలా…?

ఈజిప్టు పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు అద్దంపట్టే అత్యంత ప్రాముఖ్యత గల నిర్మాణాలు. సుమారు 850 సంవత్సరాలపాటు 138 పిరమిడ్లను వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాలలో నిర్మించారు.  మరి భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో పిరమిడ్లను ఎలా నిర్మించి ఉంటారు? పిరమిడ్ల నిర్మాణంలో వాడిన మోర్టార్‌ (సిమెంటు లాంటి జిగురు పదార్థం) ఏ తరహా రసాయన పదార్థం?ఆ అంశాలను మనమిప్పుడు తెలుసుకుందాం.


కైరో నగరానికి దాదాపు 50కి.మీ.దూరంలో ఉన్న సక్కారా ప్రాంతంలో మొదలయి, దాదాపు 200 కి.మీ.దూరం వరకు విస్తరించిన హవారాప్రాంతం వరకూ వివిధకాలాల్లో ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ 138 పిరమిడ్లలో నేడు చాలా కూలిపోయి నేలమట్టమయ్యాయి. కేవలం పునాదుల అవశేషాల ఆధారంగా, మిగిలిన పిరమిడ్ల నమూనాల కనుగుణంగా లెక్కించి 138పిరమిడ్లుగా గుర్తించారు. ఇప్పుడు వివిధ పతనదశల్లో 30వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలోఉన్నవి కేవలం 8మాత్రమే. ఇందులో క్రీ.పూ.2550 సంవత్సరంలో గిజా ప్రాంతంలో నిర్మించిన గ్రేట్‌ పిరమిడ్‌ సుమారు 150మీ.ఎత్తు ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టడా లను పక్కనబెడితే 20వ శతాబ్దాంతం వరకు లెక్కిస్తే మానవనిర్మిత నాగరిక కట్టడాలలో గ్రేట్‌ పిరమిడ్‌ అత్యంత ఎత్తయిన కట్టడం.

పిరమిడ్లు అనేవి ఆనాటి కాలాల్లో ఛాందస భావాలతో ఉన్న పాలకుల సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్‌ను జోసర్‌ అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సక్కారా ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్‌ పిరమిడ్‌ను. క్రీ.పూ.2530 సంవత్సరంలో గిజా ప్రాంతంలో ఖాఫెర్‌ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. చివరి పిరమిడ్‌ను మూడవ అమ్మెన్‌ మాట్‌ సమాధిగా హవారాలో క్రీ.పూ. 1860లో ప్రారంభించి సుమారు 50 సంవత్సరాలకు పూర్తిచేశారు. పిరమిడ్లు అంటేనే గణితం ప్రకారం బహుభుజ ఆధారపీఠం ఉన్న శంఖాకృతులు. అంటే ఆధారపీఠం త్రికోణాకృతితోగానీ, చతురస్రా కారంతో గానీ ఉండడం ఆనవాయితి. పార్శ్వభాగాలు ఆధారపీఠంలోని ప్రతిభుజంనుంచి కూచీగా బయలుదేరి పైభాగాన కూచాగ్రం (అపెక్స్‌) దగ్గర కలుస్తాయి. అంటే ప్రతి పార్శ్వపుగోడ సమ ద్విబాహు త్రిభుజాకృతిలో ఉంటాయన్నమాట. క్రమంగా పైకెళుతున్నకొద్దీ అడ్డుకోత వైశాల్యం తగ్గుతూ ఉండడం వల్ల పైభాగాన ఉన్న బరువ్ఞను కిందభాగంలో ఉన్న ఆధారం స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన త్రిమితీయ (త్రీడైమెన్షనల్‌) ఘన ఆకృతులలో పిరమిడ్లు ప్రముఖమైనవి. 

ఈజిప్టు పిరమిడ్‌ ఏదీ పూర్తిగా ఘనరూపం కాదు. మధ్యలో నిలువ్ఞగా సన్నని గుహ లాంటిది ఉంటుంది. పిరమిడ్‌ పార్శ్వ గోడల నుంచి ఒకటి,రెండుచోట్ల ఈ గుహలోకి నాళిక ల్లాంటి దారులు ఉంటాయి. సాధార ణంగా ఇవి కిందివైపు మెట్లతో (దిగుడుబావిలోకి దిగినట్లుగా) ఉంటాయి. అక్కడక్కడా అవి మధ్య గుహలోకి వెళ్లాక అక్కడ విశాలమైన ప్రాంతం లోకి తెరుచుకుంటాయి. ఇదేచోటుకి మెట్లులేని గొట్టాల ద్వారా పిరమిడ్‌ పక్కగోడ లకు దారులు ఉంటాయి. ఇవి గాలిని లోనికి పంపి, బయట, లోపల సమానవాయుపీడనం ఉండేలా చేస్తాయి. గరిమనాభి నుంచి కింది వైపుకు నిలువ్ఞగా గీచిన ఊహారేఖ ఆధారపీఠం గుండా వెళ్లి నట్లయితే ఆ వస్తువ్ఞ పడిపోదనీ, ఆ గీత ఆధారపీఠం నుంచి పూర్తిగా ఒకవైపుకు విడిగా వెళితేనే వస్తువ్ఞ పడిపోతుందనీ స్కూల్లో నేర్చుకుంటాం. ఆ సూత్రం ఆధారంగా ఒకవస్తువ్ఞ మీద మరో వస్తువ్ఞను ఉంచడానికి ఎలాంటి జిగురు, సిమెంటు అవసరం లేదు. మనం గ్రంథాలయంలో 20 పుస్తకాలను ఒక దానిమీద ఒకటిగా పేర్చామనుకోండి. అవి పడి పోకుండా ఉంచాలంటే విడిగా వాటిని కట్టాలని గాని, పుస్తకానికీ, పుస్తకానికి మధ్య జిగురు పెట్టాలన్న నిబంధనగానీ లేదుకదా. కొన్నివేల మంది కార్మికులు, కొన్ని దశాబ్దాలపాటు శ్రమిస్తూ, ఏనుగులు, గుర్రాలను వాడుకొంటే పిరమిడ్ల నిర్మాణం రాజులకు సులభసాధ్యమే.

Great Pyramid: గ్రేట్ పిరమిడ్ 

ప్రపంచంలో అత్యంత, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు ఈజిప్ట్ పిరమిడ్లను.ఇవి ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా ఉంటాయి. ఇవి ఈజిప్టు రాజుల సమాధులు. ఇందులో ఒకటి గ్రేట్ పిరమిడ్. దీని మధ్య భాగంలో ఛియోవ్స్ సమాధి ఉంటుంది. దీని నిర్మాణానికి 1,00,000 మంది బానిసలు పని చేశారు. రాజులు శవాన్ని ఉంచే శవపేటిక (కాఫిల్ లేక సర్కోఫంగస్) ఈ గ్రానైట్ గదిలో పశ్చిమాన ఉంది. ఉత్తర దిశ నుంచి పిరమిడ్ లోపలికి ప్రవేశ మార్గం ఉంది. అక్కడ నుంచి ఒక వరండా ఉంది.

Gija Pyramid: 

అతిపురాతన నాగరికతకు పేరుగాంచింది ఈజిప్టు.. ఇక్కడ పిరమిడ్స్ , మమ్మీల తో పాటు ఎన్నో రహస్య ప్రదేశాలకు కూడా కేరాఫ్ అడ్రస్ ఈజిప్టు . అయితే ఇక్కడ మమ్మీలే కాదు.. ఆల్ గిజాలోని ఎడారిలో ఉన్న ఓ రాతి సింహం కూడా ఎంతో ప్రసిద్ధి. గిజా సింహిక ఇది కొండరాతితో చెక్కిన విగ్రహం. ఇప్పటికీ సైన్స్ చేధించని మిస్టరీ ప్లేస్ ల్లో ఒకటి ఈ సింహిక. ఒక ఏకశిలా రాతితో చెక్కబడిన ఒక విగ్రహం ముఖం ఓ మహిళ ముఖంగా శరీరం సింహంలా చెక్కబడిన ఈ విగ్రహాన్ని గిజా సింహిక అని అంటారు. గిజాలో ఉన్న సింహికకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈజిప్ట్ జాతీయ చిహ్నంగా పూర్వ వైభవం చాటి చెప్పేలా గొప్ప నిర్మాణ కట్టడాలలో ఒకటిగా ఖ్యాతిగాంచింది గిజా సింహిక. ఇప్పటీకే ఈ విగ్రహం మిస్టరీనే పురాతన శాస్త్రజ్ఞులకు సవాల్ విసుతూనే ఉంది.

ఈ సింహిక విగ్రహం గురించి నిర్మాణం గురించి భిన్నవదనాలున్నాయి. ఈ విగ్రహాన్ని దాదాపు ఏడు వేల నుంచి పదివేల సంవత్సరాల క్రితం చెక్కారని కొందరు, 4,500 సంవత్సరాలు చెక్కారని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ సింహిక తో పాటు ఎడారిలో నిర్మించిన అనేక నిర్మలు కాలగర్భంలో కలిసిపోయాయి. అనేక కట్టడాలు, నిర్మాణాలు దాదాపు పూర్తిగా శీలమైపోయాయి. అయినప్పటికీ సింహిక విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ విగ్రహం చాలా ఏళ్ళు ఇసుకతో కప్పబడి ఉంది. అందుకనే ఈ విగ్రహం సేఫ్ గా ఉందని కొంతమంది వాదిస్తారు.


17వ శతాబ్దంలో ఈ విగ్రహం కాళ్ల కింద రెండు గదులు ఉన్నట్టు పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే ఆ గదులను తెరవడానికి ఎటువంటి వీలు లేకుండా ఉంది. అయితే తాము ఎలాగైనా ఆ గదులు ఓపెన్ చేయాలనీ భావించిన శాస్త్రజ్ఞులకు అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అందుకనే ఈ గదులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఆ గదుల మీద రీసెర్చ్‌‌ చేయడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్‌‌ ఇవ్వడంలేదు. అయితే… అందులో గ్రహాంతర వాసులు ఉన్నారని, అతీంద్రియ శక్తులు ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికే గిజా పిరమిడ్‌‌ని తెరవాలనుకున్న వాళ్లు శపించబడ్డారని ప్రచారంలో ఉంది. అందుకే దీన్ని తెరవకపోవడమే స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ గ్రేట్ పిరమిడ్ సింహికను జపనీస్ పురాతన తత్వవేత్త పలు అధ్యయనం చేశారు

Tutankhamun's Treasures (Full Episode) | Lost Treasures of Egypt NGC CHANNEL VIDEO

Giza Pyramid From Space || Satellite View || Google Earth

RARE FOOTAGE INSIDE THE GREAT PYRAMID

Aerial View of Great pyramids

https://www.youtube.com/watch?v=RtsCs_VfszE

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top