Thursday, August 26, 2021

GREAT WALL OF CHINA


WHATSAPP GROUP TELEGRAM GROUPక్రీ.పూ 475 నుంచి 221 శతాబ్ది వరకూ పోరాటాల్లోని రాజ్యాలు నిర్మించిన వివిధ రక్షణ కుడ్యాల్లాంటి నిర్మాణాలను కలుపుతూ మంగోలియా ప్రాంతాల నుంచి వచ్చే సంచార జాతుల దండయాత్రికులను ఎదుర్కోవడానికి క్విన్ వంశానికి చెందిన తొలి చైనా చక్రవర్తి క్విన్ షి హుయాంగ్ ఒక మహా కుడ్యాన్ని నిర్మించడం ప్రారంభించడంతో చైనా గోడ చరిత్ర ప్రారంభమైంది.

ప్రపంచంలోని 7 వింతలలో చైనా వాల్ ఒకటి. ఈ 7 వింతలలో అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా ఇది ప్రసిద్ధి చెందింది. దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని పిలుస్తారు

క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దంలో చైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి రాజ్యాలకు ఉత్తర దిక్కు ఉన్న మంగోలియన్ తెగల నుండి రక్షణ కొరకు వారి రాజ్యాల చుట్టూ గోడను  కట్టుకున్నారు. తరువాతి కాలంలో  “ఖిన్ షీ హువాంగ్” అనే చక్రవర్తి తన ప్రత్యర్ధులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని మొత్తం ఒకే సామ్రాజ్యంగా చేసాడు. ఈ “ఖిన్ షీ హువాంగ్” అనే రాజు  తన రాజ్యములో అడ్డుగా ఉన్న కొన్ని గోడలను పడగొట్టించి తన సామ్రాజ్యంలో ఉత్తర దిక్కున మిగిలిన గోడలను కలుపుతూ ఒక పెద్ద గోడను నిర్మించాడు. ఈ గోడను కొండల ప్రాంతంలో అక్కడ మైదాన ప్రాంతంలో దొరికే  రాళ్లతో, మట్టితో మరియు చెక్క తో నిర్మించారు. ఆ తరువాత కాలంలో వచ్చిన అనేక రాజులు వల్ల ఈ వాల్ నిర్మాణం జరగలేేదు.


చాలా కాలం తర్వాత క్రీ. శ  14 వ శతాబ్దంలో  మింగ్ రాజవంశం (1368-1644) రాజులు తమ రాజ్యాన్ని  మంగోలియన్ల నుండి కాపాడుకోవడం కోసం మళ్ళీ ఈ గోడను కట్టడం ప్రారంభించారు.

మింగ్ వంశ రాజుల కాలంలో రాళ్లతో, మట్టితో కట్టడం వల్ల ఈ గోడ నేటికి నిలిచి ఉంది. ఈ మింగ్ వంశ రాజుల కాలంలో  దాదాపుగా 8,850 కి.మీ చైనా వాల్  నిర్మించారు. దాదాపుగా 25,000 వాచ్ టవర్లు గోడ మధ్య మధ్యలో కొండల ప్రాంతంలో బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించారు. ఈ వాచ్ టవర్స్ వల్ల శత్రువుల దాడిని ముందే పసిగట్టి ఒక టవర్ నుండి మరొక టవర్ కి సమాచారం అందచేసి యుద్దానికి ముందుగానే సిద్ధం అయ్యేవారు.


చైనా లో తరువాత 16 వ శతాబ్దంలో  చైనా రాజ్యం మొత్తం ” ఖిన్గ్ డైనోస్ట్ ”  చేతికి వచ్చింది. ఈ రాజులు మంగోలియా దేశంలోని కొంత భాగాన్ని తమ సామ్రాజ్యంలో కలుపుకోవడం వల్ల చైనా దేశం   చైనా వాల్ ని దాటి విస్తరించింది. దీనితో చైనా వాల్ ని కట్టడం ఆపివేశారు.

చైనా గోడ గురించి ముఖ్య విషయాలు

 1. ఈ చైనా వాల్ 5 నుండి 6 మీటర్ల వెడల్పు మరియు   7 నుండి 8 మీటర్ల ఎత్తు ఉంటుంది.
 2. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు 21,196 km ఉంటుంది
 3. చైనా వాల్  నిర్మించడానికి పది లక్షల మంది వరకు పనిచేశారు. గోడను కట్టే క్రమంలో దాదాపుగా నాలుగు లక్షల మంది కార్మికులు మరణించారు.
 4. ప్రతి సంవత్సరం దాదాపుగా కోటి మంది టూరిస్టులు ఈ చైనా వాల్ ను సందర్శిస్తుంటారు.
 5. భూమి పైన మనుషుల చేత కట్టబడిన అతి పొడవైన కట్టడంగా  ఈ చైనా గోడ మాత్రమే ప్రాచుర్యం పొందింది. మానవ నిర్మితంతో కట్టబడిన ఈ గోడ అనేక చైనా రాజుల చేత కొన్ని వందల సంవత్సరాలు కట్టించబడింది.
 6. చైనా వాల్ అనేది అంతరిక్షం నుండి చుస్తే కనపడుతుందనేది అవాస్తవం. అంతరిక్షం నుండి కొన్ని ప్రత్యేక పరికరాలతో చూసినట్ట్లైతే మనకు ఇది  చిన్న గీత లాగ కనబడుతుంది.
 7. చైనా వాల్ పర్యాటక ప్రదేశంగాను మరియు చైనా దేశపు జాతీయ చిహ్నంగా నిలిచి ఉంది.
 8. చైనా గోడ మధ్యలో మనకు చాలా బురుజులు, టవర్లు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి పురాతన  కాలంలో శత్రువుల కదలికలను గుర్తించడానికి, సైగల ద్వారా సందేశాలను పంపడానికి ఈ నిర్మాణాలు చాలా ఉపయోగపడ్డాయి.
 9. చైనా గోడ కట్టడం చైనా దేశం దాటి విస్తరించడంతో అప్పటి నుండి చైనా వాల్ కట్టడం ఆపేసారు.
 10. చైనా గోడ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ గూడలోని ఇటుకలను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించడం వల్ల ఈ గోడ చాలా వరకు దెబ్బతింది. అంతే  కాకుండా కొందరు ఈ గోడలోని  రాళ్లను దొంగలించి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. దీని వలన కూడా చైనా వాల్ నష్టపోతోంది.
 11. 2009 లో నదులలో, కొండ ప్రాంతాలలో దాగి ఉన్న 180 కి,మీ  చైనా వాల్ ని గుర్తించడం జరిగింది. మళ్ళి 2015 లో కూడా కనుమరుగైన మరో 10 కి,మీ చైనా వాల్ గుర్తించారు.
 12. చైనా వాల్ నిర్మించడానికి 10 లక్షల కంటే  ఎక్కువ కార్మికులు పనిచేశారు. ఇంత పెద్ద గోడను కట్టే క్రమంలో దాదాపుగా 4 లక్షల మంది వరకు చనిపోయారు. అందుకే  కొంతమంది ఈ చైనా వాల్ ను అతిపెద్ద స్మశాన వాటిక అనికూడా పిలుస్తుంటారు.

చంద్రుడి మీద నుంచి నిజంగానే Great Wall Of China కనిపిస్తుందా...నిజాలివే...
ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం, ఈ గోడ మానవ నిర్మిత నిర్మాణం మాత్రమే కాదనే వాదన ఉంది. అలాగే ఈ భారీ గోడను ఆకాశం నుండి చూడవచ్చంటారు. చంద్రుడి మీద నుంచి కూడా కనిపిస్తుందని పేరుంది. కాని భూమికి కేవలం 2 మైళ్ళ నుండి చూస్తేనే వెంట్రుకలా సన్నగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ గోడను చంద్రుడి నుండి స్పష్టంగా చూడటం ఒక అపోహ.
Also Read: 

ఈ గోడ నిర్మాణం యొక్క ఏకైక ఉద్దేశ్యం ఉత్తర దిశ విదేశీ ఆక్రమణల నుండి రక్షించడమే కాదు. స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసుకునే వస్తువులపై పన్ను ఎగవేతను నివారించడం, అలాగే వలసలను నియంత్రించడం. ఈ గోడ ప్రధాన ఉద్దేశ్యం.

1987 లో, విలియం లిండ్సే అనే సుదూర బ్రిటిష్ రన్నర్ 1500 మైళ్ల పొడవైన చైనా గోడను కాలినడకన పూర్తి చేశాడు.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణ సమయంలోనే చైనా ప్రజలు చక్రం మోసే వాహనాన్ని కనుగొన్నారని కూడా అంటారు. దీనిని వీల్‌బారో అంటారు. ఇది నిర్మాణ సమయంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

గోడ మీద ఆధిపత్యం కోసం శతాబ్దాలుగా వేలాది యుద్ధాలు జరిగాయి. అనేక రాజవంశాలు మరియు సామ్రాజ్యాలలో యుద్ధాలు జరిగాయి. ఎవరైతే దానిని నియంత్రించారో, శత్రువును ఓడించడం సులభం. ఇక్కడ చివరి యుద్ధం 1938 లో జపనీస్ యుద్ధంలో జరిగింది.

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top