ప్రశ్న: సాధారణ ప్రదేశాల్లో కన్నా సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తారు? ఎందుకు?.
Ans: సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయ సమయాల్లో సముద్ర ప్రాంతాల్లోనే కాకుండా.. భూమ్యాకాశాలు కలిసినట్లుగా కనిపించే చోట సూర్యుడు, చంద్రుడు పెద్దగా అగుపిస్తారు. మిట్టమధ్యాహ్నం కన్నా ఉదయం, సాయంత్రాల్లో సూర్యుడు పెద్దగా కనిపించడానికి మానవ దృష్టి భ్రమ (హ్యూమన్ ఆప్టికల్ ఇల్యూషన్) కారణమని పరిశోధనల్లో తేలింది. నిజానికి సూర్య, చంద్రుల పరిమాణాల్లో పెద్దగా తేడాలు ఉండవు. సముద్రతీరాల్లో, ఉదయం, సాయంత్రం వేళల్లో తీసిన.. అలాగే వేరే ప్రాంతాల్లో, వేరే సమయాల్లో తీసిన చిత్రాల్లో సూర్య, చంద్రుల పరిమాణాలు దాదాపు ఒకేలా ఉంటాయి.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.