1 నుంచి 10వ తరగతి బాలబాలికలకు ఏకరూప (యూనిఫాం) దుస్తులు రూపకల్పనకు మార్గదర్శకాలు

ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 18-08-201

విషయం: సమగ్ర శిక్ష -  2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా 'జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్ 1 నుంచి 10వ తరగతి బాలబాలికలకు ఏకరూప (యూనిఫాం) దుస్తులు రూపకల్పన నమూనా - జిల్లా విద్యాశాఖాధికారులకు సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లుకు సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు

నిర్దేశాలు: 

1) ఆర్.సి.నెం.SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 07-06-2021

2 ) ఆర్.సి.నెం.SS-16021/3/2021-CMO SEC - SSA లేది: 3) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC SSA తేది: | 12-08-201 05-08-2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యాకానుక' కార్యక్రమాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు 16.08.2021న లాంచనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ యాజమాన్య సంస్థల్లో నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులకు సమగ్రశిఖా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ (కుట్టు కూలీతో సహా), జత బూట్లు & 2 జతల సాక్సులు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వర్క్ లుక్స్, బెల్టు, బ్యాగుతో పాటు ఈ ఏడాది అదనంగా ఇంగ్లీషు - తెలుగు డిక్షనరీ అందజేస్తారు. దీనిలో భాగంగా విద్యార్థులకు 3 జతల దుస్తుల రూపకల్పన, నమూనా ఇవ్వడం జరిగింది. 1 నుండి 10 వరకు బాలబాలికలకు 3 జతల ఏకరూప దుస్తుల రూపకల్పన నమూనా:

బాలికల యూనిఫాంలో కుట్టించవలసినవి:

  1. 1, 2 తరగతుల బాలికలకు షర్ట్, లాంగ్ ప్రాక్ కుట్టించాలి. 3,4,5 తరగతుల బాలికలకు షర్ట్, స్కర్ట్ కుట్టించాలి.
  2. 6,7,8,9,10 తరగతుల బాలికలకు చుడీదార్, చున్నీ (సల్వార్ కమీజ్) కుట్టించాలి.

బాలురకు యూనిఫాంలో కుట్టించవలసినవి:

  1. 1,2,3,4,5,6,7 తరగతుల బాలురకు షర్ట్, ఎక్కరు కుట్టించాలి.
  2. 8,9,10 తరగతుల బాలురకు షర్ట్, ప్యాంటు కుట్టించాలి.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad