Friday, June 11, 2021

VACCINE PRICES : దేశీ తయారీ COVAXIN ధర రెండింతలు.. విదేశీ టీకాలు ఎందుకు చవక?


WHATSAPP GROUP TELEGRAM GROUPBharat Biotech's Covaxin, the only made-in-India vaccine of these three, is almost double the price of Covishield and costs as much as Pfizer abroad - around $19. It is the third costliest vaccine globally.

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాల్లో దేశీయ తయారీ కొవాగ్జిన్ ధరే ఎక్కువ. కొవిషీల్డ్ ఒక డోసు ధర రూ. 780. రష్యా స్పుత్నిక్-వి ధర గరిష్ఠంగా రూ. 1,145.  కొవాగ్జిన్ ధర ఒక్కో డోసు ధర రూ. 1,140. ఇందులో జీఎస్టీ రూ. 140 కూడా ఉంది. విదేశీ టీకా అయిన కొవిషీల్డ్‌, ఫైజర్ కంటే ధర కంటే ఇది దాదాపు రెండింతలు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ ధర కలిగిన టీకాల్లో ఇది మూడోది.

కొవాగ్జిన్ ధర ఎందుకు అంత ఎక్కువ?

A Covishield dose cannot cost more than ₹ 780 a dose, Russia's Sputnik V will cost a maximum of ₹ 1,145 a dose and Covaxin cannot be costlier than ₹ 1,410 a shot. This includes ₹ 150 in GST or Goods and Services Tax.

దేశీ తయారీ అయిన కొవాగ్జిన్ ధర నిజానికి తక్కువ ఉండాలి కానీ, అంత ఎక్కువ ఎందుకు అన్న ప్రశ్నకు నిపుణులు ఏమంటున్నారంటే.. కొవాగ్జిన్ సాంకేతికత మిగతా వాటితో పోలిస్తే ఖరీదైనది. కొవిషీల్డ్, స్పుత్నిక్ టెక్నాలజీతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైనది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో నిష్క్రియం చేసిన మొత్తం వైరస్‌ను ఉపయోగించారు. కాబట్టి అత్యంత ఖరీదైన వందలాది లీటర్ల సీరమ్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. వైరస్ సీరమ్‌లో బీఎస్ఎల్ ల్యాబ్స్ కింద చాలా జాగ్రత్తలతో పెరుగుతుంది. ఆ తర్వాత దీనిని నిష్క్రియం చేస్తారని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అడ్వైజర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. 

కొవిషీల్డ్‌తో పోలిస్తే కొవాగ్జిన్ ధర రెండింతలని పేర్కొన్న మిశ్రా.. కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాల ధరల్లో వ్యత్యాసానికి వాణిజ్యపరమైన కారణాలు ఉండొచ్చని అన్నారు. టెక్నాలజీ పరంగా, ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీ చాలా సులభమే కాకుండా చవకమైనవని, వీటి తయారీకి విస్తృత సౌకర్యాలు అవసరం లేదని మిశ్రా వివరించారు. 

ఫైజర్, మోడెర్నా టీకాలు ఎంఆర్ఏ వ్యాక్సిన్లు. వీటి తయారీలో కొవిడ్‌కు కారణమయ్యే లైవ్ వైరస్‌ను ఉపయోగించరు. దీనికి బదులుగా వైరస్ ఉపరితలంపై కనిపించే ‘స్పైక్ ప్రొటీన్’ శరీర కణాలకు హాని చేయని రీతిలో ఉయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. 

వైరస్‌లో ఏదైనా వేరియంట్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ప్రభావం చూపలేకపోతే.. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను కొత్త వేరియంట్‌కు అనుగుణంగా త్వరగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే పనిచేయాలంటే మాత్రం కొవాగ్జిన్ టెక్నాలజీకి తడిసిమోపెడవుతుంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ నిష్క్రియం చేసిన వైరస్ ఆధారంగా తయారవుతుంది. కొత్త వేరియంట్‌కు అనుగుణంగా తిరిగి మరో వ్యాక్సిన్ తయారు చేయాలంటే సుదీర్ఘమైన సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ధరలు కొవాగ్జిన్‌తో పోలిస్తే చాలా తక్కువ. అవన్నీ గతేడాదే రూపుదిద్దుకున్నాయి. 

 ఇక వ్యాక్సిన్ తయారీ ధర పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ముడి సరుకులు, ప్యాకేజింగ్, ప్లాంట్ ఆపరేషన్, నిర్వహణ, ఖర్చులు, లైసెన్స్ కోసం చేసిన ఖర్చు, ఉత్పత్తికి అయ్యే ఖర్చు, క్లినికల్ ట్రయల్స్ వంటి వాటిపై వ్యాక్సిన్ ధర ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ తయారీకి అయిన ఖర్చుకు మూడింతలుగా దాని ధరను నిర్ణయిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, వ్యాక్సిన్ ఎలా ఉపయోగించాలన్న దానిపై ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించడానికి మరో 30 శాతం ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, పన్నులు, స్టాకిస్టులు, రిటైల్ కెమిస్టుల వాటా తదితరలు కూడా ఇందులో ఉంటాయి. 

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భారత్‌లో టీకా తయారీదారులకు ఒక్క డోసులో మూడు నుంచి నాలుగు రూపాయలు మాత్రమే లభిస్తుంది. ప్రొడక్ట్ అభివృద్ధి, తయారీలో ఉన్న వారికి మాత్రం డోసుకు రూ.10 మిగులుతుంది. అయితే, తయారీదారులు పెరిగి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే అప్పుడు టీకా ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

WHATSAPP GROUP TELEGRAM GROUP

SEARCH THIS SITE

LATEST UPDATES

Varadhi worksheets class 1-10
Your Salary slip with One Click

TRENDING

SCERT TEXT BOOKS CLASS 1 TO 10

Mid Day Meal

NAADU NEDU

EDUCATIONAL APPS

JOBS/RESULTS/NOTIFICATIONS

ORDERS & PROCEEDINGS

TRANSFERS 2020

Top