లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ భారీ ఊరట.. కీలక ప్రకటన!

 రుణ గ్రహీతలకు శుభవార్త

ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రీస్ట్రక్చరింగ్ 2.0 ప్రకటన.


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక ప్రకటన చేసింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయాన్ని వెల్లడించింది. లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో చాలా మందికి ఊరట కలుగనుంది.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా రీస్ట్రక్చరింగ్ 2.0 ఫెసిలిటీని ఆవిష్కరించారు. వ్యక్తిగత రుణాలు, స్మాల్ బిజినెస్ రుణాలు పొందిన వారి కోసం ఈ ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో రీస్ట్రక్చరింగ్ బెనిఫిట్ పొందని వారు ఈసారి రీస్ట్రక్చరింగ్ 2.0 ప్రయోజనం పొందొచ్చు.

రూ.25 కోట్ల వరకు రుణాలు పొందిన వారికి రీస్ట్రక్చరింగ్ 2.0 అందుబాటులో ఉంటుంది. 2021 మార్చి 31 నాటికి స్టాండర్డ్ రుణాలుగా ఉన్న లోన్స్‌కే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వారి రుణ గ్రహీతల కోసం సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ఈ రీస్ట్రక్చరింగ్ బెనిఫిట్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చు.


రీస్ట్రక్చరింగ్ 1.0 కింద రెండేళ్లలోపు వరకు మారటోరియం పొందిన రుణాలకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రీస్ట్రక్చరింగ్ 2.0 కింద మారటోరియంను 2 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చని శక్తికాంత దాస్ తెలిపారు. ఇకపోతే ఆర్‌బీఐ కేవైసీ నిబంధనలను కూడా సవరించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad