Tuesday, May 18, 2021

కరోనా వేళ... టెన్త్ పరీక్షలేల?



ఆంధ్ర భూమి దిన పత్రిక సంపాదకీయం లో...


ఒకవైపున కరోనా కేసులు విపరీతంగా పెరుగు తున్నాయి. మరో వైపున రాష్ట్రంలో ఉపాధ్యాయులు 160మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. ఇంకా రాలిపోతూనేవున్నారు. మరో వైపున ఉపాధ్యాయు అందరికీ రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. 45 సంవత్సరాలు నిండిన వారికే వ్యాక్సినేషను పరిమితం చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకోని 45 సంవ త్సరాల లోపువారు ఎంతోమంది ఇన్విజిలేషన్ డ్యూటీలకు వెళతారు. ఈ పరీక్షలు రాసే లక్షల మంది విద్యార్థుల కుటుంబాలలో ఎంత మందికి కరోనా వచ్చిందో తెలియదు. ఆక్సిజెన్ సమస్య, ఆసుపత్రులలో బెడ్ల కొరత మూలంగా ఏవిద్యార్థి తల్లితండ్రులు ఏవిధమైన కరోనా సమస్య ను ఎదుర్కుంటున్నారో తెలియదు. ఈవిపత్కర సమయంలో పరీక్షా కేంద్రాలను సరిగ్గా శానిటైజ్ చేయటం, సామాజిక దూరం పాటించటం కష్టసాధ్యం. అన్నింటి కంటే పరీక్ష భయంకంటే కరోనా వస్తుందనే భయంవల్ల విద్యార్థులు సరిగ్గా పరీక్షలు రాయలేరు. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం పట్ల తల్లి తండ్రులు విపరీతమైన ఆందోళనకు లోనవుతున్నారు. వేలమంది తల్లితండ్రులు పరీక్ష వేళ కేంద్రాలకు తమ పిల్లలను వెంట బెట్టుకు రావాలి. కరోనా బారిన పడకుండా తగిన సామాజిక దూరం పాటించటానికి వాళ్లకీ తగిన ఏర్పాట్లు చేయాలి. ఇన్విజిలేటర్లతోపాటు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటాయి. పరీక్షా పత్రాల కోసం ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి. పరీక్షల తర్వాత మళ్ళీ స్పాట్ వాల్యుయేషన్ కోసం టీచర్లందరూ ఒకే చోట గుమి కూడాలి. కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసు కోవాలి. ఇంత సంక్లిష్టమైన పరీక్షల నిర్వహణలో ఏ ఒక్కరు కరోనా కాటుకు బలైతే.. ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు ఈ పరిస్థితు లలో కరోనా ఎవ్వరికీ రాదని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వగలదా?. కరోనా భయంతోనే సీబీఏసీ పదవ తరగతి పరీక్షలను తొలిసారిగా రద్దు చేసింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసు కున్నది. దేశవ్యాప్తంగా 21 లక్షలమంది విద్యార్థు లుఈ పరీక్ష రాయాల్సి ఉంది. సీబీఎస్ఈ నిర్ణయం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ వాస్తవాన్ని మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసు కోవాలి. అంతేగాదు మరో ముఖ్య విషయం..కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్, కేంద్ర బోర్డు కూడా ఈ సంవత్సరం రద్దు చేసి ప్రత్యామ్నాయ పదవ తరగతి పరీక్షలను మార్గాల ద్వారా విద్యార్థుల సంవత్సరాంత ప్రతిభ ఆధారం గా గ్రేడ్లు ఇచ్చి అంద రినీ పాస్ చేయాలని నిర్ణయించింది. చివరకు 12వ తరగతి విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఈ కరోనా క్లిష్ట సమయంలో మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యమని పరీక్షలు రద్దు చేయాలని ట్విట్టర్ ద్వారా చేసిన విన్నపాలను సీబీఎస్ఈ పరిశీలిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఫార్మేటివ్ పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా 10వ తరగతి విద్యార్థుల నందరినీ పాస్ చేసి గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయిం చింది. ఇంకా చాలా రాష్ట్రాలు ఈ బాటనే నడిచాయి. తమిళనాడు ప్రభుత్వ మైతే ముందు చూపుగా ఈ కరోనా ప్రమాదాన్ని ఊహించి ఫిబ్రవరి లోనే 10వతరగతి పరీక్షలను రద్దు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవలే. ఇదే నిర్ణయం తీసుకుంది. ఇలా దేశంలో ఒక్కొక్కటిగా రాష్ట్రాలన్నీ 10 వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుం టున్నాయి. రాష్ట్రంలో రెండు లక్షల పైగా కరోనా ఏక్టివ్ కేసులు ఉన్నాయి. దాదాపు తొమ్మిది వేలకు పైగా కరోనా బారిన పడి చనిపోయారు. రోజుకు 22 వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ దశలో కూడా 10 పరీక్షలు నిర్వహించడం అంత అవసరమా? లక్షలాదిమంది ప్రాణాలను పణంగా పెట్టడం న్యాయమా? అందువల్ల టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వినయపూర్వకం గా కోరుతున్నాం..

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర బోర్డులుఅనుసరించిన మార్గాన్ని ఎంచుకుని పదవ తరగతిఅంతే కాదు జూన్ 1 నుంచి టీచర్లు స్కూళ్ళకు రావాలని విద్యామంత్రి సెలవిచ్చారు. మరోవైపు కరోనా బారిన పడకుండా వయసుతో నిమిత్తం లేకుండా టీచర్లందరికీ, వారి కుటుంబాలకు రెండు విడతల వ్యాక్సిన్ డోస్లను ఇవ్వాలి.. విద్యార్థుల కుటుంబాలకూ ఇవ్వాలి. టీచర్లనూ కరోనా బారిన ఫ్రంట్ లైన్ వర్కర్లగా పరిగణించి పడిన ప్రతి టీచరకు నెగటివ్ వచ్చేవరకూ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. కరోనాతోమరణించిన ప్రతి ఉపాధ్యాయునికి వైద్యులకు, నర్సులకు . పారిశుద్ధ్య కార్మికులకు ఎలా ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారో అదే విధానాన్ని వర్తింపజేయాలి. ఇవేవీ అమలు చేయ కుండా రకరకాల పేర్లతో టీచర్లను స్కూళ్ళకు రప్పించడం వల్ల భద్రత, భరోసా కోల్పోవటమే కాకుండా విపరీతమైనఆందోళనకు లోనవుతున్నారు. ఇలా ఆందోళనకు లోనై గుండె పోటుతో మరణంచిన టీచర్ ఉదంతం నాకు తెలుసు. 1918 లో స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు రెండవ వేవ్ లో 5 కోట్లమంది చని పోయారు. అప్పుడు ప్రపంచ జనాభా 160 కోట్లు, భారత దేశ జనాభా 25 కోట్లే. కాని ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్లు దాటింది. భారత దేశ తాజా జనాభా సంఖ్య 136కోట్లు దాటింది. అప్పటి తో పోలిస్తే వైద్యం అభివృద్ధి చెందిన మాట వాస్తవమైనా ఇప్పుడొచ్చిన కరోనా ఏ రూపం ఎప్పుడు తీసుకుం టుందో తెలియని పరిస్థితి రెండు వ్యాక్సిన్ డోసు లేసుకున్నా కరోనా రకరకాల వేరియంట్లుగా మారడం మూలాన అది 50 శాతమే పనిచేస్తోందని మరో వైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకని ప్రభుత్వం పెద్దమనసుతో ఆలోచించి ఎటువంటి భేషజాలకు పోకుండా 10వతరగతి తరగతి. పరీక్షలను రద్దు చేయాలి.

పరిస్థితి తీవ్రతను బట్టి ఇదే అలోచనను ఇంటర్ పరీక్షల విషయంలోనూ చేయాలి. ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఈ ప్రపంచంలో మరేది వుంటుంది చెప్పండి?

డా. ఏ.యస్.రామకృష్ణ మాజీ ఎమ్మెల్సీ


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRENDING POSTS

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top