లక్నో : ఓ ముస్లిం మతాధికారి చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు దాదాపు 10 వేల మందికి పైగా హాజరయ్యారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీసం మాస్కు కూడా ధరించలేదు.
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన ముస్లిం మతాధికారి అబ్దుల్ హామీద్ మహమ్మద్ సాలిమూల్ ఖాద్రీ ఆదివారం చనిపోయాడు. ఈ వార్త నిమిషాల్లోనే ఇతర రాష్ర్టాలకు చేరింది. దీంతో ఆ మతాధికారి అభిమానులు, ప్రజలు భారీ స్థాయిలో బదౌన్ జిల్లాకు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇసుకెస్తే రాలనంతా జనం వచ్చారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు
అయితే అంత్యక్రియలకు కేవలం 20 మందిని అనుమతిస్తే ఇటీవలే యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మతాధికారి అంత్యక్రియలకు పది వేల మందికి పైగా హాజరవడంతో.. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాస్కు ధరించకపోతే తొలిసారి రూ. వెయ్యి, మాస్కు ధరించకుండా రెండోసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించాలని యూపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. యూపీలో గత కొద్ది రోజుల నుంచి రోజుకు 20 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.