ఇండియాకు లాక్ డౌన్ కావాల్సిందే: అమెరికా వార్నింగ్


భారత్ లో కరోనా వ్యాప్తి విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మే మొదటి వారంలో 5 లక్షల కేసులు రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని మిచిగాన్ ప్రొఫెసర్ భ్రమార్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. మే చివరి వారంలో రోజు 5,500 మరణాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్ట్ చివరి నాటికి కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. డబుల్ మ్యూటంట్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

మే 11 నుంచి 15 నాటికి పీక్ దశలో కరోనా ఉంటుందని తెలిపారు. ఇండియాలో కఠిన లాక్ డౌన్ అవసరం ఉందని చెప్పారు. వెలుగులోకి రాని కేసులు మరణాలు ఎన్నో ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పట్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కాదని మే నెలలో తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad