Friday, April 23, 2021

పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించాలి: జాక్టోఅమరావతి, ఆంధ్రప్రభ: కరోనా తీవ్రత రోజురోజుకూ ఉధృతమవుతున్న ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసి సెలవులు ప్రకటించాలని జాక్టో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్క జాక్టో చైర్మన్ కె. జాలి రెడ్డి, సెక్రటరీ జనరల్స్ మల్లు శ్రీధర్ రెడ్డి, అంకాల్ కొండయ్య, వర్కింగ్ చైర్మన్ శ్రావణ్ కుమార్ లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేసినట్లు మీడియా కన్వీనర్ సామల సింహాచలం తెలిపారు. రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు రద్దు చేసి సెలవులు ప్రకటించారని, పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే మూడు రోజులుగా దేశవ్యాప్తంగా కేసులు, మరణనాల సంఖ్య వేలల్లో పెరిగిపోయిందని, రాష్ట్రంలో గడచిన వారం రోజుల్లో దాదాపు ఇరవై మంది ఉపాధ్యాయులు కరోనాకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షలకు ఉపాధ్యాయులు వ్యతిరేకం కాదని, ప్రస్తుతం ఉన్న కోవిడ్ ప్రమాదకర పరిస్థితులు దృష్ట్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు.

కలోనా పెరుగుతున్న నేపద్యంలో విద్యార్ధుల, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని పీఆర్జీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిట్టా కృష్ణయ్య, వైష్ణవ కరుణానిధి మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని, కనుక మన రాష్ట్రంలో కూడా రద్దు చేయాలని కోరారు.

ప్రమాదంలో 2 లక్షల మంది ఉపాధ్యాయులు: ఎంటీఎఫ్

రాష్ట్రంలో తరగతులు జరుగుతున్న హైస్కూల్ పిల్లలు కరోనా గ్రాహకాలుగా మారుతున్నారని, అందువల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు టీచర్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2. లక్షల మంది ఉపాధ్యాయుల ఆందోళనను గుర్తించి విద్యాశాఖ మంత్రి విద్యార్థులు, టీచర్ల ప్రాణాల కోసమైనా పరీక్షలు రద్దు చేయాలని కోరారు.

చదవడం మాకిష్టం' వాయిదా వేయాలి

విద్యాశాఖకు రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం వినతి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆదివారం అన్ని గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞపి చేసింది. గురువారం ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డా. కళ్లేపల్లి మధుసూదనరాజు, కన్వీనర్ కోన దేవదాసు, అధికార ప్రతినిధి బీరం వెంకట రమణ విద్యాశాఖ డైరెక్టర్. గ్రంథాలయాల శాఖ డైరెక్టర్లకు లేఖలు రాశారు. 

గ్రంథాలయాల్లో ఎక్కువ మంది విద్యార్థులతో జరిపే ఈ కార్యక్రమం వల్ల కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని, రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉధృతి తగ్గే వరకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ సిబ్బంది పలువురు కరోనా బారిన పడి మృతి చెందారని, మరికొంత మంది పాజిటివితో అనుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో ఎందటి వేవ్ సమయంలో పనివేళలు ఉదయం 10 గంటల నుంచిసాయంత్రంస్ గంటల వరకు మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన విధంగా ఇప్పుడు కూడా అనుమతి మంజూరు చేయాలని కోరారు.


0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

SEARCH THIS SITE

RECENT NEWS

TRANSFERS/PROMOTIONS 2022

✺ TEACHERINFO వాట్సాప్ గ్రూప్ లింక్స్ ✺ SCERT TEXT BOOKS CLASS 1 - 10

CETS/NOTIFICATIONS/RESULTS

HEALTH

EDUCATIONAL APPS

PROMOTION GOs/LEAVE RULES

ORDERS & PROCEEDINGS

SERVICE MATTERS

Top